Begin typing your search above and press return to search.

చదివినంతనే వికారంగా అనిపించే ఈ క్రైం ఇష్టమైతేనే చదవండి

By:  Tupaki Desk   |   9 Jun 2023 9:45 AM GMT
చదివినంతనే వికారంగా అనిపించే ఈ క్రైం ఇష్టమైతేనే చదవండి
X
ఇంత వికారంగా ఉన్న క్రైం గురించి ఇంత వివరంగా రాయాల్సిన అవసరం ఉందా? ఎందుకిలాంటి ఉదంతాల గురించి సమాచారం ఇస్తారు? మీరేం ఆశిస్తున్నారు? మనసు మీద విపరీతమైన ప్రభావం చూపే ఇలాంటి ఉదంతాల గురించి తెలియకపోవటమే మంచిదన్న భావన.. ఈ దారుణ హత్యోందతం గురించి తెలిసినంతనే అనిపిస్తుంది. కానీ.. ఇలాంటి దారుణ నేరాల గురించి తెలిస్తే.. మనిషిలో పెరుగుతున్న రాక్షస గుణం మరింత అలెర్టుగా ఉండాలన్న విషయాన్ని హెచ్చరించేలా చేస్తుంది. ఈ క్రైం గురించి చదివే ముందు.. మీకో సూచన. సున్నిత మనస్కులు దీన్ని చదవొద్దు. ఫీల్ కావొద్దు.

దేశ వ్యాప్తంగా కలకలాన్ని రేపి.. షాక్ కు గురి చేసిన శ్రద్ధావాకర్ కేసు గుర్తుంది కదా? దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. సహజీవనం చేసినోడి చేతుల్లో దారుణంగా హత్యకు గురై.. శరీర భాగాల్ని కోసి.. ఫ్రిజ్ లో దాచేసి.. విడతల వారీగా బయట పడేసిన ఆ రాక్షసుడ్ని పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. తాజా దారుణం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటు చేసుకుంది.మిరారోడ్ ప్రాంతంలో గీతానగర్ లోని ఒక అపార్టు మెంట్ లో 56 ఏళ్ల మనోజ్ సానే.. 32 ఏళ్ల సరస్వతి వైద్య కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వారుంటున్న ప్లాట్ నెంబరు 704 నుంచి దర్వాసన రావటంతో అపార్ట్ మెంట్ వాసులు కంప్లైంట్ చేశారు.

ఆ ప్లాట్ తలుపుల్ని బద్ధలు కొట్టిన లోపలకు వెళ్లిన పోలీసులు సైతం కరెంటు షాక్ తగిలినట్లైంది. వంటగదిలో మూడు బకెట్లలో ఉడకబెట్టిన మానవ శరీర భాగాలు కనిపించాయి. చెడువాసన రాకుండా చేసే ఎయిర్ ఫ్రెషనర్లు చాలా కనిపించాయి. ఫ్లాట్ లోపలే ఉన్న మనోజ్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు అతడ్ని ప్రశ్నిస్తే.. అవి తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి శరీర భాగాలుగా ఒప్పుకన్నాడు. తమ మధ్య గొడవలు జరుగుతున్న మాట నిజమే కానీ.. ఆమెను తాను చంపలేదని.. ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుందన్నాడు.

అయితే.. అతడి మాటల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవటం.. అతడి మాటల్లో వ్యత్యాసంతో మరింత లోతుగా విచారించగా.. అతడే ఆమెను దారుణంగా హతమార్చిన విషయం బయటకు వచ్చింది. సరస్వతి ఒక అనాధ. ముంబయిలోని బోరివిలిలో ఒక అనాథ శరణాలయంలో ఉండేవారు. ఐటీఐ చదివిన మనోజ్.. ఆ ప్రాంతంలో రేషన్ షాప్ నడిపేవాడు. ఆ క్రమంలో అతడికి 2014లో ఆమె పరిచయమైంది. స్నేహం కాస్తా రిలేషన్ షిప్ గా మారింది. ఇద్దరు కలిసి బోరివిలిలోకొన్నాళ్లు సహజీవనం చేశారు. 2017లో మిరారోడ్ ప్రాంతానికి మకాం మార్చారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు.

జూన్ 4న సరస్వతి హత్య జరిగింది. రెండు.. మూడు రోజులుగా వారి ప్లాట్ నుంచి దుర్వాసన రావటంతో పక్క ప్లాట్ లోని సోమేశ్ శ్రీవాస్తవ ఆరా తీసే ప్రయత్నం చేశారు. చాలాసేపు తలుపు తీయపోవటం.. ఏదో స్ప్రే చేసినట్లుగా శబ్ధం రావటం.. తలుపు తీసిన తర్వాత దుర్వాసన తనకు వస్తుందని చెప్పి.. తాను బయటకు వెళుతున్నట్లుగా చెప్పి.. పనుందని చెప్పాడు. దీంతో అతడి తీరు మీద అనుమానం మొదలైంది. శ్రద్ధావాకర్ హత్య.. ఆమె శరీర భాగాల్ని 35 ముక్కలుగా నరికి.. ఆ భాగాల్ని ప్లాస్టిక్ కవర్ లో చేసిన ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. సరస్వతి శరీరాన్ని ముక్కలుగా చేసి.. ఉడకబెట్టి ప్లాస్టిక్ కవర్లలో పారేసేందుకు సిద్ధంగా ఉంచుకున్నాడు. అప్పటికే కొన్ని భాగాల్ని వారు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కనున్న డ్రైనేజీలో పారేసినట్లుగా భావిస్తున్నారు. అయితే.. సరస్వతి శరీర భాగాల్ని ఉడికించిన తర్వాత కుక్కలకు పెట్టినట్లుగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన ఆధారాల్లేవని పోలీసులు చెబుతున్నారు.

అయితే.. అతను రెండు మూడు రోజలుుగా కుక్కలకు ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని తాము చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో.. అతడు పెట్టిన ఆహారం.. సరస్వతి శరీర భాగాలుగా అనుమానిస్తున్నారు. ఆమెను హత్య చేసి.. ఆమె శరీర భాగాల్ని కోసేందుకు అవసరమైన కట్టర్ మొదలుకొని.. నల్లటి కవర్లు.. శరీర భాగాలు కొన్ని వంటగదిలోని బకెట్లలో లభించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కోర్టులో ప్రవేశ పెట్టిన మనోజ్ ను పద్నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇచ్చారు.