Begin typing your search above and press return to search.

14 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన తల్లిని ఫేస్ బుక్ తో పట్టుకున్న కొడుకేం చేశాడంటే?

By:  Tupaki Desk   |   23 Jan 2023 5:00 PM GMT
14 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన తల్లిని ఫేస్ బుక్ తో పట్టుకున్న కొడుకేం చేశాడంటే?
X
హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక దారుణ హత్య గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ఈ హత్యకు కారణం.. చూస్తే ఇలా కూడా జరుగుతుందా? అన్న భావన కలుగక మానదు. రీల్ కథకు ఏ మాత్రం తగ్గని ఈ క్రైం ఉదంతంలోకి వెళితే.. క్రిష్ణా జిల్లా తెలప్రోలు గ్రామానికి చెందిన ఒక మహిళ పద్నాలుగేళ్ల క్రితం భర్తను.. పిల్లల్ని.. కుటుంబాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసింది. కోల వెంటరమణమూర్తిఅనే వ్యక్తితో ఉండిపోయింది.

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వీరిద్దరిని స్థానికులంతా కూడా భార్యభర్తలుగా భావిస్తుంటారు. అయితే.. వీరిద్దరు ఏళ్లకు ఏళ్లుగా సహజీవనం చేస్తూ ఉండిపోయారు. వెంకటమూర్తి విషయానికి వస్తే అతడు పీర్జాదిగూడలోని ఒక ఓల్డేజ్ హోంలో కేర్ టేకర్ గా పని చేస్తుంటాడు. ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్ల క్రితం ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయిన తల్లిని ఆమె కుమారుడు ఫేస్ బుక్ ద్వారా తన తల్లి ఆచూకీని గుర్తించాడు.

నెల రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన అతడు.. తల్లి చిరునామాను పట్టుకొని ఆమెను కలిశాడు. ఆమె కలిసి ఉన్న వెంకటరమణమూర్తితోనూ సన్నిహితంగా ఉన్నట్లు నటించేవాడు. తల్లిని ఒప్పించి ఎట్టకేలకు ఊరికి తీసుకెళ్లాడు.

అక్కడి నుంచి ఆమె హైదరాబాద్ కు రాకపోవటం.. దీంతో వెంకటరమణమూర్తి ఆమెను నగరానికి వచ్చేయాలంటూ ఫోన్ చేసేవాడు. దీంతో.. తన తల్లి తనకు దూరం అవుతుందన్న ఉద్దేశంతో ఆ కొడుకు తాజాగా మళ్లీ హైదరాబాద్ కు వచ్చాడు.

తన తల్లి గురించి మాట్లాడాలంటూ సిట్టింగ్ కు కూర్చున్నాడు. వారిద్దరు కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మాటల మధ్యలో ఆ పక్కనే ఉన్న ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ తో వెంటకరమణమూర్తి తల మీదా పక్కటెముకల మీద దాడి చేయటంతో పాటు తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచేశాడు.

సిలిండర్ కింద పడిన శబ్దం రావటంతో ఆ ఇంటి యజమాని కొడుకు రూం వద్దకు వెళ్లి చూశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వెంకట రమణమూర్తిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అతడు మరణించినట్లుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.