Begin typing your search above and press return to search.

బైక్‌పై మ‌హిళా సీఎం.. సంచ‌ల‌నం రేపిన విష‌యం.. ఎక్క‌డ‌..? ఎందుకు?

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:50 AM GMT
బైక్‌పై మ‌హిళా సీఎం.. సంచ‌ల‌నం రేపిన విష‌యం.. ఎక్క‌డ‌..? ఎందుకు?
X
పై ఫొటోలో ఉన్న మ‌హిళ సాధార‌ణ దుస్తుల్లో ఉన్న అసాధార‌ణ నాయ‌కురాలు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి కూడా! నిజానికి ముఖ్య‌మంత్రి అంటేనే ముందొక ప‌ది కార్లు.. వెనుక మ‌రో ప‌ది కార్లు.. భారీ కాన్వాయ్‌.. అడుగ‌డుగునా పోల‌సుల చెకింగ్ వంటి హంగామా ఉంటుంది. కానీ, బెంగాల్ సీఎం కు ఆ హ‌డావుడి న‌చ్చ‌దు.

కేవ‌లం మూడునాలుగు కార్ల‌తోనే స‌రిపెడ‌తారు. అది కూడా ప్రొటోకాల్ అంటూ.. అధికారులు చెప్ప‌డంతోనే. ఇక‌, తాజాగా ఆమె బైక్‌పై ప్ర‌యాణించారు. త‌న కారును వేరేవారికిఇచ్చారు. ఇది రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో కిందపడ్డ ఫొటో జర్నలిస్ట్ను తన సొంతకారులో ఆసుపత్రికి తరలించారు. బెంగాల్ రాజధాని కోల్కాతాలో రెజర్లకు సంఘీభావంగా నిర్వహిస్తున్న క్యాండిల్ ర్యాలీలో ఈ ఘటన జరిగింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్తలు కవర్ చేస్తుండగా.. ఫొటో జర్నలిస్ట్ సుభ్రాంశు ఒక్కసారిగా కిందపడ్డాడు. వెంటనే స్పందించిన సీఎం మమత.. అతడికి నీళ్ల బాటిల్ అందించారు.

అనంతరం తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సెక్యూరిటీ బైక్పై సీఎం మ‌మ‌త వెళ్లిపోయారు. ఫొటో జర్నలిస్ట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు.. ఆసుపత్రికి సైతం వెళ్లారు మమతా బెనర్జీ. ఆవిడ సింప్లిసిటీకి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఏపీ, తెలంగాణ‌ల్లో ముఖ్య‌మంత్రులు బ‌య‌ట‌కు వ‌స్తే.. ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి గురి అవ్వాల్సిన ప‌రిస్థితినివారు ఉటంకిస్తున్నారు.

అంతకు ముందు రెజ్లర్లకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడిన మమతా.. బ్రిజ్ భూషణ్పై పోక్సో కేసు నమోదు చేయాలన్నారు. కేవలం ఆయన రాజీనామా చేస్తే సరిపోదని.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.