Begin typing your search above and press return to search.

దేశం కాని దేశంలో పాకిస్థాన్ కు దారుణ అవమానం

By:  Tupaki Desk   |   31 May 2023 10:00 PM GMT
దేశం కాని దేశంలో పాకిస్థాన్ కు దారుణ అవమానం
X
దేశం కాని దేశంలో దారుణ అవమానానికి గురైంది దాయాది పాకిస్థాన్. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం దారుణ పరిస్థితి ఎదురైంది. ఆ దేశ విమానయాన సంస్థకు చెందిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానాన్ని మలేషియా అధికారులు సీజ్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానాన్ని మలేషియా నుంచి పీఐఏ తీసుకుంది. దీనికి సంబంధించిన లీజు బకాయి ఉందన్నది మలేషియా వాదన. మరోవైపు పాకిస్థాన్ మాత్రం తమ బకాయిల్ని ఎప్పుడో తీర్చేసినట్లుగా వాదిస్తోంది.

ఈ విమానాన్ని 2018లో కూడా ఒకసారి మలేషియా అధికారులు సీజ్ చేశారు. అయితే.. ఆ తర్వాత బకాయిల చెల్లింపులపై పాకిస్థాన్ దౌత్యపరమైన హామీ ఇవ్వటంతో వదిలేసినట్లుగా చెబుతారు.

దీంతో.. ఆ సమయంలో ఆ విమానంలో ఉన్న 173 మంది ప్రయాణికులు ఉండగా.. వారిని, విమాన సిబ్బందిని తీసుకొని పాక్ కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇదే విమానాన్ని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లీజు పెండింగ్ మొత్తం మీద వాదన జరుగుతోంది. పాకిస్థాన్ వాదన ప్రకారం చూస్తే.. 1.8 మిలియన్ డార్లు మాత్రమేనని.. ఆ మొత్తాన్ని కూడా చెల్లింపులు జరిపినట్లుగా చెబుతోంది. ఈ ఫ్లైట్ లీజ్ విషయంలోనూ వివాదం నడుస్తోంది.

ఈ విమానం మనదేనని ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీ వాదిస్తోంది. అయితే.. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ మాత్రం విమానంలోని ఒక ఇంజిన్ మాత్రమే లీజింగ్ కంపెనీకి చెందుతుందని చెబుతోంది. దీని బకాయిల్ని కూడా తాము చెల్లించినట్లు చెబుతోంది.

ఈ వాదనలు ఎలా ఉన్నా.. పాక్ విమానాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్ చేయటం.. దాయాది దేశానికి దారుణ అవమానంగా మారింది. ఇదిలా ఉంటే.. సీజ్ నుంచి విడిపించటానికి వీలుగా కౌలాలంపూర్ లోని న్యాయ సలహా టీంతో పాక్ అధికారులు చర్యలు చేపట్టినట్లుగా డాన్ పత్రిక పేర్కొంది.