Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: సెలబ్రెటీల ట్విట్టర్ హ్యాక్..బిట్ కాయిన్ కుంభకోణం

By:  Tupaki Desk   |   16 July 2020 6:00 AM GMT
బ్రేకింగ్: సెలబ్రెటీల ట్విట్టర్ హ్యాక్..బిట్ కాయిన్ కుంభకోణం
X
ప్రపంచంలోనే దిగ్గజ సోషల్ మీడియా అయిన ట్విట్టర్ పై హ్యాకర్లు పడ్డారు. ఎన్నడూ లేని విధంగా ట్విట్టర్ లోని అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లలోకి చొరబడ్డారు. వాటన్నింటిని హ్యాక్ చేసి తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఓ పద్ధతి ప్రకారం ట్వీట్లను చేశారు. ఈ క్రమంలోనే బిట్ కాయిన్, క్రొప్టోకరెన్సీ కుంభకోణానికి తెరతీశారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం షాక్ కు గురైంది.వాళ్లు చేసిన ట్వీట్లను డిలీట్ చేసే పనిలో పడింది.

బ్లూ రైట్ మార్క్ ఉండే అమెరికన్ హైప్రొపైల్ టాప్ సెలెబ్రెటీలు, ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లనే హ్యాకర్లు ఎంచుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెక్ దిగ్గజం యాపిల్, అమెరికా ప్రతిపక్ష నేత జోబిడెన్, బిలియనీర్ ఎలన్ మస్క్, కుబేరుడు జెఫ్ బోజెస్, కర్ధాషియన్ వంటి బడా వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి సంచలనం సృష్టించారు. వారి అకౌంట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా హ్యాకర్లు బిట్ కాయిన్ రూపంలో తమ ఖాతాలకు వెయ్యి డాలర్లను పంపించాలని.. ఆ అమౌంట్ వెంటనే డబుల్ అవుతుందని అని మెసేజ్ పెట్టారు. కుబేరులు 1000కి 2వేల డాలర్లు ఇస్తామనడంతో లక్షల మంది ఫాలోవర్స్ నిజమేననుకొని వాటిని ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో కోట్లు హ్యాకర్స్ పరమయ్యాయి.

హ్యాకింగ్ జరిగిందని గుర్తించిన ట్విట్టర్ వెంటనే నష్టాన్ని నివారిస్తూ ఆ ట్వీట్లను తొలగిస్తోంది. అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని అందరినీ సూచించింది. ఇదో పెద్ద బిట్ కాయిన్ కుంభకోణంగా వర్ణించింది. ఇక కొన్ని అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ హ్యాకర్స్ ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై పరిశోధిస్తున్నారు. ట్విట్టర్ సెక్యురిటీ విభాగం దీనిపై చర్యలు చేపడుతోంది.