మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి 12 కోట్లు స్వాహా!

Mon Jan 24 2022 22:00:02 GMT+0530 (IST)

Mahesh Bank Server Hacked

టెక్నాలజీతో ప్రజలకు ఎంత ఉపయోగాలు చేయవచ్చో.. అంతే స్థాయిలో నష్టం చేకూర్చవచ్చు.దాన్ని మంచికి వాడితే లోక కళ్యాణం.. చెడుకు వాడితే లోక వినాశనం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. అదీ అలా ఇలా కాదు.. ఏకంగా 12 కోట్లు కొల్లగొట్టారు. తాజాగా హైదరాబాద్ లో ‘మహేష్ బ్యాంక్’ సర్వర్ ను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేశారు. అందులోని రూ.12 కోట్లు మాయం చేశారు.

మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్ ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసిన వెంటనే ఆ 12 కోట్లను 100 వేరు వేరు బ్యాంక్ అకౌంట్లను ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో మహేష్ బ్యాంక్ యాజమాన్యం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకుల్లోని డబ్బులు మాయం చేయడంతోపాటు అమాయక ప్రజలను కూడా మోస్తున్నారు. తమకు లోన్ వచ్చిందని.. కొంత ఎమౌంట్ జమ చేస్తే పూర్తి డబ్బులు తీసుకోవచ్చని ప్రజలకు ఫోన్ కాల్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

పోలీసులు ఎన్ని సూచనలు చేసిన ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హైదరాబాద్ నగర వాసులు సైబరాబాద్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ పరిష్కారాలు మాత్రం కావడం లేదు. సైబర్ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే చాకచక్యంగా బయటపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.