మహేష్ బాబు ఫీల్ అవుతాడు.. అలా అనకు: కేటీఆర్

Tue Oct 04 2022 10:35:49 GMT+0530 (India Standard Time)

Mahesh Babu will feel.. Don't say that: KTR

తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమయం సందర్భాన్ని బట్టి వేసే పంచులు బాగా పేలుతుంటాయి.   ఏ విషయంపైనా అవగాహన క్లారిటీతో ప్రసిద్ది చెందారు. అదే సమయంలో ఆయన తన తెలివితేటలతో పాటు చాలా మందిని విస్మయానికి గురిచేస్తారు. నిన్న జరిగిన కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమానికి కేటీఆర్ హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగం హైలైట్‌గా నిలిచింది.ముఖ్యంగా టాలీవుడ్ లో హీరో మహేష్ బాబుతో మంత్రి కేటీఆర్ కు చక్కటి స్నేహం ఉంది. గతంలో 'సార్ అని పిలిచిన మహేష్ ను వారించి.. రామ్ అని పిలువు' అని కేటీఆర్ కోరారు. ఇక నిన్న మహేష్ బాబు తల్లి చనిపోతే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇలా వీరి మధ్యన బంధుత్వం బాంధవీయం ఇప్పటికీ కొనసాగుతోంది.అయితే తనను మహేష్ తో పోల్చిన 'బిగ్ బాస్ ఫేం' గంగవ్వను వారిస్తూ సెటైర్ వేశాడు మంత్రి కేటీఆర్.

కేటీఆర్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియా స్టార్ గంగవ్వ 'లుక్స్ లో కేటీఆర్ ను మహేష్ బాబు'లా ఉంటాడని పోల్చింది... దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. 'నాకేం కాదు కానీ మహేష్ బాబు ఫీల్ అవుతాడు.  అని తన దైన శైలిలో అందరినోట నవ్వులు పూయించాడు. గంగవ్వకు ఫోన్ చేసి మరీ టైం చూసుకొని  'నేను మై విలేజ్ షో' షోకి వస్తానని తనకు తెలిసిన కొన్ని విషయాలను పంచుకుంటానని ఆమె నుంచి నేర్చుకుంటానని హామీ ఇచ్చాడు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు ప్రజలందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ వందేమాతరం ఇప్పటికీ ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ పట్టుకొని ముందుకు సాగుతున్నారని.. ఆయన దాన్ని విడిచిపెట్టి గులాబీ జెండాకు రావాలని.. ఇక్కడి అభివృద్ధి చూడాలని కోరారు.   కోరినవన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని ఉద్ఘాటించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.