Begin typing your search above and press return to search.

మ‌హానాడు జోష్‌.. ముంద‌స్తు వ్యూహానికి ఆక్సిజ‌నేనా?

By:  Tupaki Desk   |   30 May 2023 2:00 PM GMT
మ‌హానాడు జోష్‌.. ముంద‌స్తు వ్యూహానికి ఆక్సిజ‌నేనా?
X
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే టిడిపి కి లాభ‌మెంత‌? ప్రస్తుతం రాజకీయ పరిణామాల ను బట్టి ముందస్తు ఎన్నికలు వస్తాయి అనేటువంటి చర్చ జోరుగా నడుస్తుంది. దీన్ని గమనిస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రిపరేషన్ ఎలా ఉంది. వచ్చే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే వస్తాయి అని ఇప్పటివరకు అనుకున్నప్పటికీ ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల ను బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ ఏడాది ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే.. మ‌హానాడు లో ఇచ్చిన మినీ మేనిఫెస్టో ముంద‌స్తుకు ఊత‌మిస్తుంద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపు పై అంచ‌నాలు వ‌స్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజల్లో ఉంటున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించినట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థుల ను ఇంకా దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు అనేటటువంటి మాట కనుక వస్తే టిడిపి కొంత‌ గందరగోళం లోనే ఉందని చెప్పాలి. అయితే మ‌హానాడు ఊపు కొంత క‌లిసి వ‌స్తోందనే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అభ్యర్థుల ను చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికల కు రెడీ అయితే పరిస్థితి ఆశించినట్టుగానే ఉంటుంది కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అని వైసిపి కనుక నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే టిడిపి పరిస్థితి మారాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు అనేటటువంటిది గనుక పరిశీలి స్తే టిడిపి లో అభ్యర్థులు రెడీ అయిన‌ట్టు కనిపించడం లేదు. కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నప్పటికీ సుప్త చేతనావస్థలో ఉన్నారు. వీరందరినీ గాడి లో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు, ఆయ‌న‌ కుమారుడు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నార‌నేది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ముందస్తుగా గనక జరిగితే టిడిపికి కొంత లాభం చేకూరే అవ‌కాశం ఉంది.

ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి అంటే షెడ్యూల్ ప్రకారం జరిగితే మార్చి ఏప్రిల్ నాటికి పొత్తుల విషయం కూడా ఖరారు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అక్టోబ‌రు డిసెంబర్ మధ్యనే ఎన్నికలు వస్తే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి కూడా పూర్తిస్థాయిలో ఏపీ పై దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉండదు. అందుకే చాలా వ్యూహాత్మకంగా వైసిపి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.