Begin typing your search above and press return to search.
ఢిల్లీ లిక్కర్ స్కాం: మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్!
By: Tupaki Desk | 7 Jun 2023 1:22 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కొత్త అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం అటు మాగుంట ఫ్యామిలోనే కాకుండా... ఒంగోలు వైసీపీకి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాఘవరెడ్డి ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచీ ఆయన జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా తన అమ్మమ్మ అనారోగ్యంగా ఉన్నందున ఆమెను చూసేందుకు బెయిల్ ఇవ్వాలని రాఘవరెడ్డి ఢిల్లీ హైకోర్టులో ఆరువారాల బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయమై ఆధారాలను రాఘవ కోర్టులో సమర్పించారు.
అయితే మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేయవద్దని దర్యాప్తు సంస్థలు కోర్టులో తమ వాదనను బలంగా వినిపించాయి. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయొద్దని సూచించాయి.
ఈ సందర్భంగా బెయిల్ కు మరింత అడ్డు తగిలిన ఈడీ... కేసులో నిందితులందరు తమ బంధువులు బాత్రూంలో పడి గాయపడుతున్నారంటూ బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంలో ఈడీ వాదనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు... మాగుంట రాఘవరెడ్డి అభ్యర్ధన మేరకు ఆరు వారాలకు బదులుగా రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
కాగా... ఇదే కేసులో వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అప్రూవర్ గా మారారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే!