మా గ్రామానికి రావొద్దు.. సొంత ఎమ్మెల్సీ ఎదుటే.. వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

Fri Dec 09 2022 20:20:35 GMT+0530 (India Standard Time)

MPTC Nagamani husband Nagaraju suicide attempt

ఏపీ అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతల నుంచే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తీవ్ర నిరసన వ్యక్తమ వుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యేకు సొంత నేత నుంచి వ్యతిరేకత ఎదురైంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటికి వెళ్లిన ఆయనను తన ఇంటికి రావొద్దంటూ.. సదరు నాయకుడు గేటు వేశారు.ఇక ఇలాంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగలు అడ్డగింతలు ఎదురవుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తమ గ్రామానికి రావొద్దంటూ అదే పార్టీకి చెందిన నాయకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన  తీవ్ర సంచలనంగా మారింది.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టాక్ ఆఫ్ది టౌన్గా మారి సొంత పార్టీలోనే వివాదాలకు కేంద్రంగా ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్కు సొంత నేతల నుంచి నిరసన సెగ తగిలింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్సీ ఇక్బాల్.. చిలమత్తూరు మండలంలోని తుమ్మలగుంటకు వచ్చారు. అయితే తమ గ్రామానికి రావొద్దంటూ వైసీపీ నాయకుడు ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించడమేంటని నిలదీశారు. దీంతో పోలీసులు వెంటనే నాగరాజును నిలువరించారు. మరోవైపు తమ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసినా.. తనకేం పట్టనట్టు ఎమ్మెల్సీ కార్యక్రమాలు నిర్వహించడం తగదంటూ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఇక్కడే ఒక రెడ్డి నాయకుడు హత్యకు గురయ్యాడు.. అది కూడా ఇక్బాల్కు చుట్టుకోవడం.. తీవ్ర వివాదానికి దారితీయడం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.