పాకిస్తాన్ పై ప్రశంసలు.. కాంగ్రెస్ ఎంపీపై విమర్శలు

Sun Oct 18 2020 19:00:28 GMT+0530 (IST)

MP Shashi tharoor praises Pakistan

ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా నియంత్రణలో భారత్ కంటే పాకిస్తాన్ ప్రభుత్వం మెరుగైన చర్యలు చేపట్టిందని ఎంపీ శశిథరూర్ విమర్శించారు. ప్రధాని మోడీ మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.కరోనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారని.. ఆయన మాటలను విని ఉంటే ఈ రోజు దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని థరూర్ అభిప్రాయపడ్డారు. వైరస్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు.

కరోనాను అరికట్టడంలో భారత ప్రభుత్వం కంటే ఎంతో పరిణితితో వ్యవహరించిందని శశిథరూర్ అన్నారు. లాహోర్ లిటరేచర్ ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ పాకిస్తానీలకు సపోర్టుగా మాట్లాడడం దుమారం రేపింది.

ఇక బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని ముస్లింలు అభద్రతా భావానికి లోనవుతున్నారని శశిథరూర్ విమర్శించారు. భారత్ లోని ఓ ఎంపీ ఏకంగా పాకిస్తాన్ ను ప్రశంసించడం ఏంటని బీజేపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సరిహద్దుల్లో కాల్పులు చేసి భారత సైనికులను చంపుతున్న పాకిస్తాన్ లకు మద్దతు పలికిన శశిథరూర్ దేశ ప్రజలకు ప్రధాని మోడీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.