Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. సోష‌ల్ మీడియాలో ఏం వైర‌ల్ అవుతోందంటే!

By:  Tupaki Desk   |   19 March 2023 7:00 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. సోష‌ల్ మీడియాలో ఏం వైర‌ల్ అవుతోందంటే!
X
ఏపీలో వైసీపీ చ‌తికిల ప‌డింది. అదేస‌మ‌యంలో అస‌లు గెలుస్తామా? లేదా.. వైసీపీ ధాటికి నిలుస్తామా లేదా? అని అనుకున్న టీడీపీ అనూహ్యంగా మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. అయితే.. రెండు రోజులుగా నెల‌కొన్న ఈ ఉత్కంఠ ప‌రిణామాలు.. రాజ‌కీయ అంశాల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు.. స‌హ‌జ‌మే అయినా.. పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి..? స‌గ‌టు ఓట‌రు స్పంద‌న ఏంటి? అనే అంశాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అదేంటో చూద్దామా??

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నాయకుల స్పందన..(గెలిస్తే ఎలా ఉంటుంది... ఓడిపోతే ఎలా ఉంటుందో...) అనేదానిపై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇదీ..

చంద్రబాబు:

గెలుస్తే: మా గెలుపు ప్రజాస్వామ్యనికి మలుపు... మేము ముందే ఊహించాo.
ఓడిపోతే: అధికార పార్టీ డబ్బులు పంచి, దొంగ ఓటర్లుతో గెలిచింది. అయినా నైతికంగా మేమే గెలిచాం. ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా

జగన్:

గెలిస్తే: సంక్షేమానికి పట్టం కట్టిన ఓటర్లు. న‌వ‌ర‌త్నాల అమ‌లు క‌లిసి వ‌చ్చింది. మూడురాజ‌ధానుల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు.
ఇదే స్ఫూర్తితో పనిచేస్తే అసెంబ్లీ 175సీట్లు మనవే!
ఓడిపోతే: ఎమ్మెల్సీ ఎన్నికలు జనరల్ ఎన్నికలు వేరు, వేరు. దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఏమి ఉండదు. మన గురి లక్ష్యం 175/175 సీట్లు అంతే! టీడీపీ ఏడుపు రాజ‌కీయాలు చేసింది.

పి.డి.ఎఫ్:

గెలిస్తే: అభ్యర్థి గుణగణాలకు, పనితీరుకు ఈ ఎన్నిక నిదర్శనం. ప్ర‌భుత్వం ఉద్యోగుల‌నుపీల్చి పిప్పిచేసింది. అందుకే స‌ర్కారుకు స‌రైన గుణ‌పాఠం చెప్పారు.
ఓడిపోతే: ఓటర్లును కోనేoదుకు రెండు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి! సమస్యలు గురించి అలోచించే సమయం ప్రజలకు ఉండటం లేదు.

నెటిజ‌న్ హోల్ అభిప్రాయం: ఎవడు గెలిస్తే మనకేంటి? ఒడిపోతే మనకెందుకు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటుకు రేటు ఎంత పెట్టవచ్చునో... ఎమ్మెల్సీ ఎలక్షన్ వలన ముందే తెలిసింది.