Begin typing your search above and press return to search.

టీడీపీ మీద బాంబు పేల్చిన ఎమ్మెల్యే మద్దాల గిరి

By:  Tupaki Desk   |   27 March 2023 9:56 PM GMT
టీడీపీ మీద  బాంబు పేల్చిన ఎమ్మెల్యే మద్దాల గిరి
X
తెల్గుగుదేశం పార్టీ నువ్వా నేనా అన్న హోరా హోరీ ఫైట్ లో ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటుని గెలుచుకుంది. దాంతో వైసీపీ పూర్తి డిఫెన్స్ లోకి వెళ్ళింది. నలుగురు ఎమెంల్యేలను సస్పెండ్ చేసింది ఇపుడు అటు నుంచి విమర్శల జల్లు కురుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ కోట్ల రూపాలతో కొనుగోళ్లకు తెర లేపిందని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది.

అందులో భాగంగా ఇపుడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వారికి మద్దతు ఇచ్చిన టీడీపీ నుంచి వచ్చి వైసీపీ జెండా ఎత్తిన వారూ మట్లాడుతున్నారు. నిన్న జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు తనకు పది కోట్లు ఆఫర్ ఇచ్చారని సంచలన కామెంట్స్ చేయగా ఈ రోజు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలా గిరిధర్ వంతు అయింది.

నాకు వారం పది రోజులన్ నుంచి తనకు టీడీపీ నేతల నుంచి బంపర్ ఆఫర్ తో సప్రదింపులు వచ్చాయని మద్దాల గిరి చెప్పారు. తనతో ఫోన్ లో కి టచ్ లో కి వచ్చేందుకు కొందరు టీడీపీ పెద్దలు కూడా ప్రయత్నం చేశారని, అన్ని వివరాలూ తన కాల్ డేటాలో ఉన్యాని ఆ ఫోన్ నంబర్లు మీరే చూడండి అని ఆధారాలతో సహా ముందు పెట్టారు మద్దాల గిరి.

చంద్రబాబుకు కొనుగోలు చేసే తత్వమని, ఓటుకు నోటుకు కేసులో ఆయన అలాగే చేశారని అన్నారు. ఇపుడు కూడా అదే పని చేశారని ఆరోపించారు తాను మాత్రం మూడు సంవత్సరాల మూడు నెలల క్రితమే టీడీపీకి దూరం జరిగాను అని ఆయన చెప్పారు. చంద్రబాబు వైఖరి నచ్చకనే ఇలా చేశాను అని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎంతసేపూ తన వారు అని ఆలోచిస్తారని గిరి మండిపడ్డారు. జగన్ అయితే అందరినీ ఒక్కటిగా చూస్తారని ప్రేమిస్తారని గిరి మెచ్చుకున్నారు. టీడీపీని పతనం చేయడానికి ఒక్క లోకేష్ చాలు అని ఆయన విమర్శించారు. టీడీపీలో చంద్రబాబుతో వేగలేకనే తాను వైసీపీ వైపు వచ్చానని మళ్ళీ ఆ వైపు ఎందుకు వెళ్తానని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు వి అడ్డదారి రాజకీయాలని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఆయన అధికారంలోకి ఎలా వచ్చారో అందరికీ తెలుసు అని కూడా సెటైర్లు వేశారు. గతంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ఇపుడు ఆయన ఏమి మారలేదని అన్నారు. టీడీపీలో తనకు సరైన గౌరవం ఇవ్వలేదనే పార్టీని వీడానని ఆయన చెప్పుకున్నారు.

ఇదిలా ఉండగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తామని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. పూటకొకరకంగా మాట్లాడితే జనాల్లో నవ్వుల పాలు కావడం తప్ప జరిగేది ఏమీ ఉండదని అన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఇన్నాళ్ళ తరువాత మద్దాల గిరి ఇపుడు మీడియా ముందుకు వచ్చి టీడీపీ బంపర్ ఆఫర్ తనకు వచ్చిందని చెప్పడంలోని ఆంతర్యం ఏంటి అన్న చర్చ సాగుతోంది. అయితే తన మీద నిందలు వేస్తున్నారు కాబట్టే తాను బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు. మరి ఆయన మీద నింద ఎవరు వేశారు. వైసీపీ రెబెల్స్ నా లేక మరోకరా అన్నది చెప్పలేదు. మొత్తానికి గిరిధర్ తాను టీడీపీకి ఓటు వేయలేదని చెప్పేసారు. మరి ఆయన మీద యాక్షన్ తీసుకునేందుకు టీడీపీ రెడీ అవుతుందా లేదా అన్నదే ఇపుడు పాయింట్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.