ఒకే టైం లో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ .. అసలు ట్విస్ట్ ఇదే !

Tue Jul 20 2021 16:04:53 GMT+0530 (IST)

Love with three girls at the same time this is the real twist

ప్రేమ .. ప్రేమ .. ఈ మధ్య కాలంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ప్రేమించి జీవితాన్ని హాయిగా గడిపే వారి కంటే ప్రేమలో మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకునే వారే ఎక్కువ. ప్రేమ పేరుతో మోసపోయిన ఎన్నో సంఘటనలు ఈ మధ్య తరచుగా వెలుగులోకి వస్తుంటాయి.  అయితే వీటి వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒక యువకుడు.. ఇద్దరు ముగ్గురు యువతులతో డేటింగ్ చేస్తుండగా మరికొన్ని చోట్ల యువతులు తామేమి మగవారికంటే తక్కువ కాదు అని ఒక్కొక్కరూ ముగ్గరు నలుగురిని ఒకరికి తెలియకుండా మరొకరిని మెయిన్ టైన్ చేస్తున్నారు.దీనితో ఈ తరహా ఘరానా మోసాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా యూఎస్ కి చెందిన ఒక యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బోయిస్ లో చోటు చేసుకుంది. కాగా బోయిస్ కు చెందిన మోర్గాన్ అనే యువకుడు బెకా కింగ్ అబిరాబర్ట్స్ టాబోర్ యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొన్ని రోజులు ఇతని మోసం బాగానే సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత టాబోర్ అనే యువతి తన ప్రియుడి మోసాన్ని గ్రహించింది. దీనితో ఈ బండారం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తన చేదు అనుభవాన్ని ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది.

టాబోర్ ఒక రోజు ఫేస్ బుక్ లో తన ప్రియుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలను చూసింది.  అనుమానంతో తన ప్రియుడి అకౌంట్ ను ఓపెన్ చేస్తే ఆమెకి షాకింగ్ విషయాలు తెలిశాయి. అతను మరో యువతితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుసుకుంది. దీనితో  తాను మోసపోయినట్లు గ్రహించింది. తాను ఎవరితో అయితే జీవితం పంచుకోవాలనుకుందో అతను మోసం చేయడంతో తట్టుకోలేక పోయింది. దీంతో సదరు ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. అతని అకౌంట్ ను మరింత పరిశీలించింది. అతనితో డేటింగ్ లో బెకాసింగ్ రాబర్ట్స్‌అనే మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించింది. అయితే టాబోర్ వీరిని రహస్యంగా కలుసుకుంది.

తన ప్రియుడి మోసం గురించి వారికి తెలియజేసింది.  ఆ తర్వాత ఒ రోజు మోర్గాన్ టాబోర్‌ను కలవటానికి వచ్చాడు. ఈ క్రమంలో వారంతా ఒక్కచోటికి చేరి అతగాడిని నిలదీశాడు. వారిని ఒక చోట చూసి అతను షాక్‌కు గురయ్యాడు. అయితే అప్పటికి వారికి మాయమాటలు చెప్పాడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు యువతులు ప్రియుడికి బుద్ధి చెప్పారు. అతగాడి బారినుంచి తప్పించుకున్నారు. అతగాడు వీరినే కాకుండా మరో ఆరుగురిని కూడా మోసం చేస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ మోసం నుంచి బయటకు పడ్డాక బెకా కింగ్ అబిరాబర్ట్స్ మోర్గాన్ టాబోర్ లు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ మోసం నుంచి బయటపడాటానికి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు.

ఈ క్రమంలో వారు ముగ్గురు కూడా ఒక పాత బస్సు కొనుగోలు చేశారు. వారు దానికి కొన్ని మరమ్మత్తులు చేయించారు. ఆ తర్వాత వారి యాత్రను ప్రారంభించారు. దీనికి కొంత మంది దాతలు కూడా సహయం చేశారు. ఈ క్రమంలో వారు.. బోయిస్ లోని సరస్సులు గ్రాండ్ టెటన్ నేషనల్ పార్క్ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా గతంలోని చేదు అనుభవాలను పూర్తిగా మరిచిపోయామని రాబర్ట్ బెకాసింగ్ తెలిపారు. ప్రస్తుతం తామంతా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని టాబోర్ తెలిపింది.