Begin typing your search above and press return to search.

ధోనీ మీద అభిమానం రైల్వే స్టేషన్ లో పడుకునేలా చేసింది

By:  Tupaki Desk   |   30 May 2023 9:59 AM GMT
ధోనీ మీద అభిమానం రైల్వే స్టేషన్ లో పడుకునేలా చేసింది
X
క్రికెట్ లో ఎందరో స్టార్లు ఉంటారు. కానీ.. సూపర్ స్టార్లు కొందరే. అయితే.. తమ అభిమాన క్రీడాకారుడితో పాటు మరో క్రీడాకారుడ్ని సైతం అంతే అభిమానించే క్రెడిట్ మాత్రం ధోనీ కే చెల్లుతుంది. మహిని అమితంగా అభిమానించే అభిమానులే కాదు.. తమ అభిమాన క్రీడాకారుడి తో పాటు ధోనీ అన్నంతనే గౌరవ మర్యాదలు ఇచ్చే వారు కనిపిస్తారు. ఇలాంటివి ధోనీ కి మాత్రమే స్పెషల్ అని చెప్పాలి.

ధోనీ మీద అభిమానానికి ప్రాంతాలు.. భాషల తో సంబంధాలు ఉండవు. హద్దులు.. సరిహద్దుల ను దాటేసేలా ధోనీ మీద ప్రేమ ను ప్రదర్శిస్తారు ఆయన అభిమానులు. ఐపీఎల్ 16వ ట్రోఫీ ఫైనల్ పోరు సందర్భంగా ధోనీ మీద అభిమానం ఎంతన్న విషయాన్ని ఆయన అభిమానులు మరోసారి ఫ్రూవ్ చేశారు.

తమ అభిమాన ఆటగాడి కోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన తీరు చూస్తే.. ధోనీ మీద్ క్రేజ్ ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టనట్లుగా కనిపించక మానదు. తాజా ఐపీఎల్ పోరు తర్వాత ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న ప్రచారం భారీగా జరుగుతున్న నేపథ్యంలో.. స్టేడియంలో అతడ్ని చివరిసారిగా చూసే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదన్న ఉద్దేశంతో ధోనీ అభిమానులు దేశం నలుమూలల నుంచి అహ్మదాబాద్ కు చేరుకున్నారు.

అయితే.. ఆదివారం జరగాల్సిన ఫైనల్ పోరు వర్షం కారణంగా నిలిచిపోవటంతో అభిమానులకు షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. ఫైనల్ పోరు ను చూసేందుకు వచ్చిన అభిమానులు తమ తిరుగు ప్రయాణాన్ని ఆదివారం రాత్రి లేదంటే సోమవారం ఉదయం పెట్టేసుకున్నారు. మ్యాచ్ ఆగిపోవటంతో.. తమ రిటర్న్ జర్నీల ను కాస్త భారమైనా మార్చుకున్నోళ్లు బోలెడంత మంది. జేబు లో డబ్బుల్లేకున్నా.. ధోనీ మీద అభిమానంతో సోమవారం కూడా ఉండిపోయారుపలువురు.

ఇలాంటి వారిలో చాలామంది వద్ద డబ్బులు లేకపోవటంతో.. ఆదివారం రాత్రి పడుకోవటం కష్టమైంది. దీంతో.. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ లో నిద్ర పోయారు. పసుపు జెర్సీలు ధరించిన పలువురు ధోనీ ఫ్యాన్స్ రైల్వే స్టేషన్ లోనూ.. ఇతర వసతి గ్రహాల్లో నూ పడుకొని.. సోమవారం మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు. ధోనీ అభిమానుల కు పరీక్ష పెట్టిన వరుణుడు.. వారి అభిమానంతో ఓడిన అతడు.. చివర కు తన ఎంట్రీ తో చెన్నై జట్టు ను గెలిపించటమే కాదు.. తాను కలిగించిన కష్టానికి బదులుగా ధోనీ అభిమానుల కు హ్యాపీ ఎండింగ్ ఇచ్చారని చెప్పాలి.