Begin typing your search above and press return to search.

కరోనా ఎక్కువ రోజులుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

By:  Tupaki Desk   |   22 March 2023 6:00 AM GMT
కరోనా ఎక్కువ రోజులుంటే ఎంత ప్రమాదమో తెలుసా?
X
కరోనా.. 2020లో ఎంటర్ అయ్యి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఓ ఏడాది పాటు అందరినీ లాక్ డౌన్ పేరిట ఇంట్లోనే కూర్చుండబెట్టింది. అంతటి తీవ్రమైన రక్కసి వేవ్ ల పేరిట దేశాలపై విరుచుకుపడి ఎంతో మందిని కబళించింది. కరోనా వచ్చి పోయాక కూడా దాని సైడ్ ఎఫెక్ట్ లతో చాలా మంది చనిపోయారు. ఈ తీవ్రమైన వ్యాధిని తట్టుకొని నిలబడడం కష్టమేనని అంటున్నారు.

దీర్ఘకాలిక కోవిడ్ దుష్ప్రభావాలపై అమెరికా పరిశోధనలు కీలక విషయాలు వెల్లడించారు. లాంగ్ కోవిడ్ తో కొందరిలో ప్రొసోపాగ్నోసియా (ఫేస్ బ్లయిండ్ నెస్) అనే వ్యాధి ఏర్పడుతోందని తేలింది. ఇతరుల ముఖం గుర్తుపట్టకపోవడం, దారులు మార్చిపోవడం ఈ వ్యాధి లక్షణాలు.

లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్న 54 మందిపై పరిశోధన చేయగా.. ఈ విషయం తేలినట్లు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వెల్లడించింది. దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న కొంతమంది వ్యక్తులు వారి సన్నిహిత కుటుంబం , బంధువులను కూడా గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారని తేలింది. .

-ప్రోసోపాగ్నోసియా లేదా ఫేస్ బ్లయిండ్ నెస్ అంటే ఏమిటి?

ప్రోసోపాగ్నోసియాను ఫేస్ బ్లైండ్‌నెస్ అని కూడా పిలుస్తారు. ఇది నరాల సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి సోకితే వ్యక్తుల ముఖాలను గుర్తించడంలో రోగులు ఇబ్బంది పడతారు. కొంతమందికి తెలిసిన ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతారు. మరికొందరు తెలియని ముఖాలను గుర్తించలేకపోవచ్చు. ఇంతలో లాంగ్ కోవిడ్ అనేది ఒక వ్యక్తి కోలుకున్న తర్వాత 4-6 వారాలకు పైగా లక్షణాలను అనుభవించే పరిస్థితి ఉంటుంది.

2020లో కోవిడ్-19 బారిన పడిన అన్నీ అనే 28 ఏళ్ల మహిళపై పరిశోధనలు చేసింది. కోవిడ్‌కు ముందు అందరి ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది పడలేదు. అయితే వ్యాధి సోకిన రెండు నెలల తర్వాత, అన్నీ తన దగ్గరి బంధువులను కూడా గుర్తించడానికి చాలా కష్టపడ్డానని తేలింది. ఒకానొక సమయంలో, ఆమె తన తండ్రిని రెస్టారెంట్‌లో కూడా గుర్తించలేకపోయింది. అపరిచితుడి ముఖంలోంచి తన తండ్రి గొంతు వినిపించినట్లు ఉందని చెప్పింది.

తాజా పరిశోధన ఫలితాలు చూస్తే కోవిడ్ 19తో మెదడు కూడా దెబ్బతింటోందని తేలింది. తీవ్రమైన సెలెక్టివ్ న్యూరోసైకోలాజికల్ బలహీనతకు దారితీస్తుందని తేలింది. దీర్ఘకాల కోవిడ్ ఉన్న వ్యక్తులలో అధిక-స్థాయి దృష్టి లోపాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు నిర్ధారించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.