లోకేశ్.. బ్రాహ్మణి.. దేవాన్ష్.. ముగ్గురూ కలిసి పూజలు

Fri Dec 06 2019 10:12:26 GMT+0530 (IST)

Lokesh Brahmani Devansh  Doing Puja

రేర్ కాంబినేషన్ ఒకటి కనిపించింది. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. పార్టీ కార్యకలాపాలకు వచ్చేసరికి మాజీ మంత్రి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి దూరంగా ఉండటం మామూలే. పార్టీ విషయాలకు దూరంగా ఉండటం బ్రాహ్మణి విషయంలో మొదటి నుంచి చూస్తున్నదే. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె కనిపించరు కూడా.అలాంటి బ్రాహ్మణి రోటీన్ కు భిన్నంగా కనిపించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచేందుకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరులో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పూజల్లో కుమారుడు దేవాన్ష్ తో కలిసి పాల్గొన్నారు.

శృంగేరీ శారదాపీఠం పండితులు రుత్విక్కుల ఆధ్వర్యంలో తొలుత గణపతి పూజ.. సుదర్శన హోమం.. గణపతి హోమాన్నిపూర్తి చేశారు. వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సుదీర్ఘంగా సాగినా.. దేవాన్ష్ ఎలాంటి ఇబ్బంది పెట్టుకుండా బుద్ధిగా.. భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి.. దేవాన్ష్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.