Begin typing your search above and press return to search.

భుజాలపై ఎత్తుకొని.. పోలీసులపై పూలు

By:  Tupaki Desk   |   6 Dec 2019 6:16 AM GMT
భుజాలపై ఎత్తుకొని.. పోలీసులపై పూలు
X
దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు మృగాళ్లను ఎన్ కౌంటర్ లో చంపిన తెలంగాణ పోలీసులపై పూల వర్షం కురిసింది. శంషాబాద్ లోని బ్రిడ్జి కింద ఎక్కడైతే దిశను కాల్చిచంపారో అక్కడే నిందితుల ఎన్ కౌంటర్ చేయడంపై జనాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ కౌంటర్ ప్రదేశానికి పెద్ద ఎత్తున చేరుకున్న జనాలు అక్కడ విచారణ జరుపుతున్న తెలంగాణ పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు. పెద్ద ఎత్తున పూలను బ్రిడ్జి పైనుంచి పోలీసులపై చల్లుతున్నారు. న్యాయం చేసిన పోలీసులకు జిందాబాద్ లు కొడుతున్నారు. వారికి జై కొడుతున్నారు.

ఇక పోలీసులు విచారణ జరుపుతున్న ప్రదేశానికి వచ్చిన కొందరు వారిని భుజాలపైకి ఎత్తుకొని అభిమానం చాటుకున్నారు. పోలీసుల కాళ్లు మొక్కుతూ మీరు చేసింది రైట్ అంటూ చేతులు జోడించి శభాష్ అంటున్నారు.

తెలంగాణలో నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకున్న ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ పోలీసుల చర్యను సమర్థిస్తున్నారు. వారిపై పూల వర్షం కురిపిస్తున్నారు. పోలీసుల చర్యకు మద్దతుగా నిలుస్తున్నారు.