Begin typing your search above and press return to search.

టాప్ 10 భారత అత్యుత్తమ బ్రాండ్స్ లిస్ట్ ఇదే!

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:00 AM GMT
టాప్ 10 భారత అత్యుత్తమ బ్రాండ్స్ లిస్ట్ ఇదే!
X
భారత అత్యుత్తమ టాప్ బ్రాండ్స్ ఏవి.. అవి ఏయే రంగానికి చెందినవి.. ఆయా బ్రాండ్ ల విలువ ఎంత... ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ... వాటికి సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేసింది ఇంటర్ బ్రాండ్ సంస్థ. ఇందులో భాగంగా... టాప్ 50 బ్రాండ్ లకు సంబంధించిన వివరాలు తెలిపింది. వీటిలో అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచింది టీసీఎస్!

తాజాగా ఇంటర్ బ్రాండ్ సంస్థ విడుదల చేసిన జాబితాలో భారత్ లో అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచింది టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). ఈ సంస్థ ర్యాంకుల్లో టాప్ 5 స్థానాల విషయానికొస్తే... వీటిలో మొదటి స్థానాన్ని టీసీఎస్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో రిలయన్స్, మూడు స్థానంలో ఇన్ఫోసిస్, నాలుగో స్థానంలో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్, ఐదోస్థానంలో జియో నిలిచాయి.

అయితే వీటన్నింటిలో అతి తక్కువ సమయంలో అత్యుత్తమ బ్రాండ్ గా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించు కోవటంతో పాటు టాప్ 5 లో నిలవడంలో జియో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ టాప్ 5 బ్రాండ్స్ విలువల విషయానికొస్తే... రూ.1,09,576 కోట్ల బ్రాండ్ విలువతో టీసీఎస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా... రూ.65,320 కోట్లతో రిలయన్స్ బ్రాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో రూ.53,324 కోట్లతో ఇన్ఫోసిస్ మూడోస్థానంలో నిలిచింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ టాప్ 5 బ్రాండ్ లలో మూడు బ్రాండ్ లు టెక్నాలజీ కంపెనీలవే కావడ్దం. దేశంలో టెక్నాలజీ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనడానికి ఈ తాజా వివరాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక సేవల రంగంలో తొమ్మిది సంస్థలు జాబితాలో చోటు సంపాదిస్తే.. హోమ్ బిల్డింగ్, ఇన్ ఫ్రా రంగం నుంచి ఏడు కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ టాప్ 10 బ్రాండ్ ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్ ల వాటానే సుమారు 46 శాతంగా ఉండటం విశేషం.

ఇక ఆ టాప్ 10 బ్రాండ్ ల లిస్ట్ ఇలా ఉంది...

టీసీఎస్

రిలయన్స్

ఇన్ఫోసిస్

హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్

జియో

ఎయిర్ టెల్

ఎల్.ఐ.సీ.

మహీంద్రా

ఎస్.బీ.ఐ.

ఐసీఐసీఐ బ్యాంకు