Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాకపోవడానికి కారణం ఇదేనా..?

By:  Tupaki Desk   |   24 Oct 2021 7:31 AM GMT
ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాకపోవడానికి కారణం ఇదేనా..?
X
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్ దాదాపు 22 రోజులుగా రిమాండ్లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన బెయిల్ కోసం 5 సార్లు పిటిషన్లు వేసినా ముంబయ్ సెషన్స్ కోర్టు తిరస్కరిస్తోంది. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించకపోయినా ఆయనను నేరస్థుడిగానే పరిగణించిన ఎన్సీబీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఆయనతో సంబంధాలున్న వారిని తెలుసుకునేందుకు ఆయన కస్టడీ అవసరమరి ఎన్సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అయితే ఆర్యన్ ఖాన్ స్నేహితుడు అర్భాజ్ ఖాన్ వద్ద డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు ఆర్యన్ ఖాన్ తోనే ఉన్నాడన్న నెపంతో ఈ నేరంలో అతడు కూడా బాధ్యుడేనని ఎన్సీబీ కోర్టుకు తెలుపుతోంది. ఈనేపథ్యంలో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈనెల 2న క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణతో ఆర్యన్ ఖాన్ న్ ఎన్సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనతో పాటు 20 మందిని అరెస్టు చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ చట్టంలోని 20 బీ, 27, 28 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే మూడు వారాలు గడుస్తున్న ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకడం లేదు. అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ ఉన్నట్లు సాక్ష్యాలులేకున్నా నేరస్థుడి ఎలా పరిగణిస్తారని ఆర్యన్ తరుపున న్యాయవాదులు పేర్కొంటున్నారు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణపై ఎన్సీబీ పలు నివేదికలను సమర్పించింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ పరిశీలించామని, అతడు డ్రగ్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేశాడన్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ కోసం ప్రయత్నించాడని తెలుస్తోందన్నారు. ఈ వివరాలను పరిశీలించిన తరువాత డ్రగ్స్ సరఫరా విషయంలో ఆర్యన్ ఖాన్ కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బెయిల్ జారీ చేస్తే మళ్లీ ఈ నేరానికి పాల్పడే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ తరువాత పలు వివరాలను సేకరించామని, అయితే లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పలు వాట్సాప్ చాట్ లను ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది.

అయితే ఆర్యన్ ఖాన్ విషయంలో ఎన్సీబీ అధికారుల ప్రవర్తనపై కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. ఆయనను అరెస్టు చేసినప్పుడు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లినప్పుడు అతడి రక్తం, మూత్రం, వెంట్రుకల నమూనాలను సేకరించలేదు. సాధారణంగా డ్రగ్స్ కేసుల్లో నిందితులన రక్తం, మూత్రం, వెంట్రుకల నమూనాలను సేకరిస్తుంటారు. ఇక ఆర్యన్ ఖాన్ అరెస్టు అయినప్పుుడు మొదట అతని వద్ద డ్రగ్స్ లభించాయని అన్నారు. కానీ ఆ తరువాత అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని అంటున్నారు. డ్రగ్స్ కలిగి ఉండడం, డ్రగ్స్ వినియోగం తదితర సెక్షన్ల కింద అర్యన్ ఖాన్ పై అనేక కేసులు నమోదు చేశారు. కానీ దీనికి అనుగుణంగా ఎలాంటి ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోతుంది. అని న్యాయవాది అశిమా మాండ్లా పేర్కొంటున్నారు.

కానీ ఎన్సీబీ అధికారులు మాత్రం ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ నెట్ వర్కింగ్ ఉందని దానిని తెలుసుకునేందుకు ప్రధానంగా దృష్టి పెట్టామని చెబుతున్నారు.ఇందులో భాగంగా ఆర్యన్ ఖాన్ గుర్తు తెలియని వ్యక్తులతో చేసిన వాట్సాప్ చాట్ ను కోర్టుకు సమర్పించారు. కానీ సోషల్ మీడియాలో నేడు ఏ వార్తనైనా సృష్టించగలం, తొలగించగలం. అందుకే వాట్సాప్ సందేశాలను కోర్టులు పరిగణలోకి తీసుకోవు. ఒకవేళ వాట్సాప్ చాటింగే ఆధారమని అనుకుంటే దానిని బహరింగపర్చాలి అని ఆర్యన్ తరుపున న్యాయవాదులు అంటున్నారు.