నిమ్మగడ్డ రమేశ్.. చంద్రబాబుకు ఉన్న బంధం బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!

Mon Jan 25 2021 12:00:01 GMT+0530 (IST)

Lakshmi Parvati reveals Chandrababu Nimmagadda Ramesh bond

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఈసీ పట్టదలతో ఉంది. ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు పెట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. అయితే ఈ తాజా పరిణామాలపై ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. ‘నిమ్మగడ్డ రమేశ్.. చంద్రబాబు కంబందహస్తాల్లో చిక్కుకుపోయాడు. చంద్రబాబు పంచన చేరినవాళ్లు ఎవరూ బాగుపడలేదు. నిమ్మగడ్డ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ నాకు చాలా కాలంగా తెలుసు. ఎన్టీఆర్ హయాంలో నిమ్మగడ్డ ఎంతో బాధ్యతగా వ్యవహరించేవారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు మాట విని భ్రష్టుపెట్టారు’ అని ఆమె పేర్కొన్నారు.వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప.. వ్యక్తుల కోసం కాదని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారడం బాధాకరమన్నారు. గతంలో ఎంతో మంచి పేరు సంపాధించిన నిమ్మగడ్డ ఇప్పుడు చంద్రబాబు మాటవిని భ్రష్టుపట్టారని పేర్కొన్నారు.  అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి చేయడం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని నీచరాజకీయాలు చేస్తున్నాడని చెప్పారు.