Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ వారసుల పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 28 May 2023 2:52 PMదివంగత మహానాయకుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని విజయవాడలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వారసత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్ కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్ కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్ కు అసలైన వారసుడు. మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడు." అని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించారని తెలిపారు. ఎన్టీఆర్ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబు కు లేదని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశయాల ను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబుని దుయ్యబట్టారు. "ఒక జిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటాను" అని పార్వత్రి అన్నారు.
"క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ నాకు ధైర్యానిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారు. నా క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు" అని లక్ష్మీపార్వత్రి అన్నారు.
కొసమెరుపు: లక్ష్మీపార్వతికన్నా ముందు ఈ కార్యక్రమంలో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. ఆమెను తల్లి వంటివారని వ్యాఖ్యానించారు.(అంటే... తనకన్నా వయసు లో పెద్దది అనేఉద్దేశంలో). కానీ, లక్ష్మీపార్వతి మాత్రం "నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడు లాంటి వ్యక్తి" అని వ్యాఖ్యానించడం గమనార్హం.