లోకేష్ సిఎం.. ఏపీ ప్రజలు అంత తెలివి తక్కువొళ్ళు కాదు

Tue Dec 18 2018 21:22:58 GMT+0530 (IST)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ భవిష్యత్తు ఏపీ సీఎం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. తమ భవిష్యత్తు నాయకుడు అంటూ లోకేష్ గురించి ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి నారా లోకేష్ గురించి లక్ష్మీ పార్వతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లోకేష్ జన్మలో సీఎం కాలేడని అతడికి అంత స్థాయి లేదని తాను గట్టిగా చెప్పగలనంటూ ఆమె కామెంట్ చేసింది.లక్ష్మీ పార్వతి ఇంకా మాట్లాడుతూ... నారా లోకేష్ ను మంత్రిగానే నేను భావించడం లేదు. మంత్రి అనేవాడు చాలా తెలివైన వాడు అయ్యి ఉండాలి రాజుకు అప్పట్లో గొప్ప గొప్ప సలహాలు ఇస్తూ పరిపాలనలో కీలకంగా వ్యవహించేవాడు మంత్రి అనేది నా అభిప్రాయం. లోకేష్ ఆ పదంకు కూడా సరిపోడని నేను భావిస్తున్నానంది. లోకేష్ భవిష్యత్తులో సీఎం అవుతాడని అంటున్నారు కదా మీ అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో... అతడు ముఖ్య మంత్రి అవ్వడం అనేది అసాధ్యం అని - ఏపీ ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు వారు లోకేష్ వంటి వ్యక్తిని సీఎంగా ఒప్పుకుంటారని నేను భావించడం లేదు. ఏపీ ప్రజలు అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటారని తాను భావించడం లేదు.

ఒక వేళ లోకేష్ సీఎం అయితే ఏపీ ప్రజలు అంత తెలివి తక్కువ వారు మరెవ్వరు ఉండరు అంటూ లక్ష్మి పార్వతి సంచన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాదు - ఇంగ్లీష్ రాదు ఏ భాష కూడా సరిగా రాని వ్యక్తి మంత్రి అవ్వడమే చాలా గొప్ప విషయం. అలాంటిది సీఎం అయ్యే అవకాశమే లేదు.