Begin typing your search above and press return to search.

లఖీంపూర్‌ ఘటన : ఆశిశ్‌ మిశ్రా ఆదేశిస్తేనే ..డ్రైవర్ అలా చేశారట !

By:  Tupaki Desk   |   14 Oct 2021 1:30 PM GMT
లఖీంపూర్‌ ఘటన : ఆశిశ్‌ మిశ్రా ఆదేశిస్తేనే ..డ్రైవర్ అలా చేశారట !
X
లఖీంపూర్‌ ఖేరి కేసు లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిశ్‌ మిశ్రా చుట్టు ఉచ్చు క్షణ క్షణానికి బిగుస్తోంది. పోలీసులు క్రైం స్పాట్‌ కు ఆశిశ్‌ ను తీసుకెళ్లి విచాణ జరిపారు . ఈ కేసులో ఆశిశ్‌ మిశ్రాతో పాటు సహ నిందితుడిగా ఉన్న అంకిత్‌ దాస్‌ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. రైతులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని , వాళ్ల మీదకు కాన్వాయ్‌ దూసుకెళ్లాలని ఆశిశ్‌ మిశ్రా డ్రైవర్‌ ను ఆదేశించాడని అంకిత్‌ దాస్‌ సిట్‌ విచారణలో వెల్లడించాడట.

అకింత్ చెప్పిన ఈ వ్యాఖ్యలతో ఆశిశ్‌ మిశ్రా కష్టాలు రెట్టింపయ్యాయి. లఖీంపూర్‌ ఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని, వేరే ప్రాంతంలో ఉన్నట్టు వాదిస్తున్నాడు ఆశిశ్‌ మిశ్రా. కాని అంకింత్‌ దాస్‌ విచారణతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళన చేస్తున్న రైతులపై అంకిత్‌ దాస్‌ కాల్పులు జరిపినట్టు కూడా అభియోగాలు నమోదయ్యాయి. అయితే, రైతులను ఢీకొట్టిన తరువాత జీపు బోల్తా పడిందని. డ్రైవర్‌ ను ను బయటకు లాగి చంపేశారని అంకిత్‌ దాస్‌ తెలిపాడు. ప్రాణరక్షణ కోసమే తాను కాల్పులు జరిపినట్టు అంకిత్‌ దాస్‌ తెలిపాడు.

ఈనెల 3న లఖీంపూర్ లో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక జర్నలిస్టుతో పాటు 9 మంది మృతి చెందారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి కోరింది. అయితే.. యూపీ సర్కార్ ఇచ్చిన నివేదికపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. ఘటనపై నిజా నిజాలు తేల్చేందుకు యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.