బూతులు మాట్లాడొద్దు.. మంత్రికి టీవీ యాంకర్ ముందస్తు విన్నపం!

Wed Dec 04 2019 11:42:19 GMT+0530 (IST)

Lady Anchor Drags down Nani with Decency Lecture

తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడటంలో నేర్పరి కొడాలి నాని. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో మంత్రి ఒకటీ రెండు ప్రెస్ మీట్లలో తీవ్రమైన పదజాలంతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద మరింత తీవ్రంగా మాట్లాడారు కొడాలి నాని. తెలుగుదేశం నేతలు ఏమీ శుద్ధపూసలు కాదు కానీ కొడాలి నాని మంత్రి హోదాలో తీవ్రంగా మాట్లాడటం బాగా హైలెట్ అయ్యింది.స్వయంగా లోకేష్ ' నీ యబ్బ.. నా యబ్బ..' అంటూ ట్వీట్లు పెడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కొడాలి నాని కూడా ‘నీ యబ్బ..’ అంటూ విరుచుకు పడ్డారు. ఇక టీవీ షోల కు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి  తీవ్రమైన పదాలు కామన్ అయ్యాయి.

ఆ మధ్య వల్లభనేని వంశీ మోహన్ రాజేంద్రప్రసాద్ లు తిట్టుకుంటే.. టీవీ చానళ్లు యథేచ్ఛగా దాన్ని ప్రసారం చేశాయి. వారు తిట్టుకున్నంత సేపూ తిట్టుకున్నాకా.. టీవీ యాంకర్ వారిని వారించారు. తిట్లనంత ప్రసారం చేసి తర్వాత అది పద్ధతి కాదని యాంకర్ చెప్పుకొచ్చారు.

ఆ సంగతలా ఉంటే.. మంత్రి కొడాలి నానితో ఇంటర్వ్యూ విషయంలో ఒక టీవీ చానల్ యాంకర్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఆయన వీరావేశంతో ప్రెస్ మీట్లలో రెచ్చిపోయిన వైనాన్ని ఆమె ప్రస్తావించింది. ఆ ఇంరట్వ్యూలో అలాంటి అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దని ఆమె కొడాలి నానిని కోరడం గమనార్హం. ఇంటర్వ్యూ ఆరంభంలోనే మంత్రికి ఆమె విన్నపాన్ని చేసుకుంది.

మొత్తానికి రాజకీయ నేతలతో ఇంటరాక్ట్ కావాలంటే మీడియా ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా ఉంది. అలా మారి పోయాయి ప్రస్తుత రాజకీయాలు.