Begin typing your search above and press return to search.

30 కోట్ల మంది ఫాలో అవుతున్న ఏకైక మహిళ ఈమె

By:  Tupaki Desk   |   14 Jan 2022 12:30 AM GMT
30 కోట్ల మంది ఫాలో అవుతున్న ఏకైక మహిళ ఈమె
X
మామూలుగా మన హీరోయిన్లను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మహా మహా హీరోయిన్లకు కోటి వరకూ ఉంటుంది. కానీ ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 30 కోట్ల మంది. సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ లో అమెరికా మోడల్ కైలీ జెన్నర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 30 కోట్లు దాటింది.

ప్రపంచంలోనే ఇంతమంది ఇన్ స్టా ఫాలోవర్లు ఉన్న తొలి మహిళగా అరుదైన ఘనత సాధించింది. పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండో వ్యక్తి కూడా ఈమె కావడం విశేషం. ప్రస్తుతం క్రిస్టియానో రొనాల్డో 38.8 కోట్ల మంది ఇన్ స్టా ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన మహిళగా పాప్ సింగర్ అరియానా గ్రాండే ఉండగా ఆమెను అధిగమించి కైలీ ఈ రికార్డును దక్కించుకుంది. అరియానాను ఇన్ స్టాలో 28.9 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. కైలీ ఇన్ స్టాలో యాక్టివ్ గా లేనప్పటికీ ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య పెరగడం విశేషం.

అమెరికాలో రియాలిటీ టీవీ స్టార్ కైలీ. ర్యాపర్ ట్రావిస్ స్కాట్ తో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే ఓ పాప ఉండగా.. ప్రస్తుతం కైలీ రెండోసారి గర్భం దాల్చింది. ఇన్ స్టాలో హాట్ హాట్ ఫొటో షూట్ లతో కైలీ అభిమానులను అలరిస్తుంటుంది.