జగన్ కి వీర విధేయుడు అయిన నెల్లూరు రూరల్ జిల్లా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి సొంత వారే పొగ పెట్టేస్తున్నారు. దాంతో రగిలిపోతున్న ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఆయన జగన్ తోనే నేరుగా ఢీ కొడుతున్నారు. వైఎస్ జగన్ కి ఆయన ఒక విధంగా భక్తుడు లాంటి వారు అంటారు. వైఎస్సార్ ఫ్యామిలీకే ఆయన అంకితం అయిన నేతగా చెప్పుకుంటారు.
అలాంటి కోటం రెడ్డికి అధినాయకత్వంతో తేడాలు వచ్చేశాయి. అవి రోజు రోజుకూ ముదిరిపాకాన పడుతున్నాయి. ఇదిలా ఉండగా కోటం రెడ్డి ఈ రోజు సడెన్ గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. దానికి కారణం పల్నాడు జిల్లా వినుకొండకు వచ్చిన జగన్ అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో సీరియస్ అయ్యారని అంటున్నారు. నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పిలిచి మరీ ఆయన ఏదో ఒకటి చేయాలని ఆదేశించారు అని అంటున్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటం రెడ్డికి కాకాణికి అసలు పడదు మరి అదే కాకాణికి జగన్ ఈ వ్యవహారం అప్పగిస్తే కచ్చితంగా కోటం రెడ్డికి అది యాంటీగానే ఉంటుంది అని అంటున్నారు. దాంతోనే ఇక తన వైపు నుంచి షాకింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి తన సన్నిహితులు అయిన నాయకులు పార్టీ నేతలను పిలిపించుకుంటున్న కోటం రెడ్డి వారితో తన రాజీనామా నిర్ణయాన్ని చెప్పి ప్రకటిస్తారు అని అంటున్నారు.
మూడు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఉన్న కోటం రెడ్డి ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీకి ఎదురు నిలబడ్డారు. ఆయన విద్యార్ధి రాజకీయాల నుంచి కూడా జనంతోనే ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రజా నేతగా ఎదిగారు. డేరింగ్ అండ్ డేషింగ్ లీడర్ గా ముద్రపడిన కోటం రెడ్డి 2014 2019లలో రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. మంత్రి పదవి అతనికి క్యాయమని అంతా అనుకున్నారు. కానీ సొంత పార్టీలో ఆయన ప్రత్యర్ధి అయిన కాకాణికి ఆ పదవి దక్కింది.
దాంతో నాటి నుంచే ఆయన రగిలిపోతూ వచ్చారు. సరే ఆ విషయం అలా ఉంటే కోటం రెడ్డిని అణచేందుకు కాకాణి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు చూస్తే ఆయనకు అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగిందని ఇది కావాలని పెంచారని చెబుతున్నారు. ఇపుడు చూస్తే కోటం రెడ్డి సోదరుడికే వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు అని తెలిసి ఆయన మధన పడుతున్నారు.
దాంతో తాను పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవడానికి కోటం రెడ్డి రెడీ అవుతున్నారు. తాను అనుమానం ఉన్న చోట కొనసాగడం అనవసరం అని ఆయన అంటున్నారు. ఆఖరుకు తన కుటుంబంలోనే చిచ్చు పెట్టే విధంగా వైసీపీ అధినాయకత్వం రాజకీయం చేస్తోంది అని ఆయన మండిపోతున్నారు. కోటం రెడ్డి రాజీనామా అస్త్రం ప్రయోగిస్తే కనుక అది వైసీపీకి బిగ్ ట్రబుల్ ని క్రియేట్ చేసే వ్యవహారమే అని అంటున్నారు. దీన్ని ఎలా డీల్ చేస్తారో అని అంత ఆసక్తిగా చూస్తున్నారు.