Begin typing your search above and press return to search.

వైసీపీ కొంప ముంచే నిర్ణయం తీసుకోబోతున్న కోటం రెడ్డి...?

By:  Tupaki Desk   |   31 Jan 2023 6:00 PM GMT
వైసీపీ కొంప ముంచే నిర్ణయం తీసుకోబోతున్న కోటం రెడ్డి...?
X
నెల్లూరు జిల్లా రాజకీయం అధికార వైసీపీలో మంట పుట్టిస్తోంది. ఒకనాటి కంచుకోట అయిన ఈ జిల్లా నుంచే అసంతృప్తి దావాలనంగా పెరిగిపోతోంది. విధేయులు అనుకున్న వరే రచ్చకెక్కుతున్నారు. దానికి కారణాలు ఏమైనప్పటికీ వైసీపీ అధినాయకత్వానికి ఇది తలనొప్పిగా మారుతోంది. నెల్లూరు రూరల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైకిలెక్కనున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన ఆడియో లీక్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఆ లీక్ అయిన ఆడియోలో ఆయన మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ జిల్లా నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తాను అని చెప్పినట్లుగా ఉంది. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, తాను కనుక ఆ వివరాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని ఆయన అన్నట్లుగా కూడా ఆడియో లో ఉంది అంటున్నారు. తనను అన్ని విధాలుగా అవమానించారని, వైసీపీ అధినాయకత్వం తనను ఇబ్బందులకు గురి చేస్తోందని కూడా కోటం రెడ్డి అన్నట్లుగా చెబుతున్నారు.

అందువల్లనే తాను పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పారని అంటున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడు అయిన కోటం రెడ్డి ఇపుడు టీడీపీలోకి వెళ్తారు అన్న వార్తలు జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ కలకలం రేపుతున్నాయి. కోటం రెడ్డి ఆడియో లీక్ నిజమేనా అందులోని మాటలు ఆయనవేనా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే కోటం రెడ్డి డైరెక్ట్ గానే మీడియాతో మాట్లాడుతూ అటాక్ చేస్తున్నారు. వైసీపీలో తనకు ఏ మాత్రం గౌరవం లేదని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు. తాను ప్రజల కోసం పాటు పడే నాయకుడిని అని తాను పార్టీ లైన్ కి వ్యతిరేకంగా మాట్లాడాను అంటే అది ప్రజల కోసమే అని అంటున్నారు. తనకు అండగా అంతా ఉండాలని ఆయన కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే కోటం రెడ్డి వైసీపీ కొంప ముంచే నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే కోటం రెడ్డి పార్టీ మారుతారు అని అనుకోవడం లేదు అని అంటున్నారు. పార్టీలో చిన్న విభేదాలు ఉన్నా అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు. కానీ కోటం రెడ్డి మాత్రం పార్టీ మీద అధినాయకత్వం మీద గుర్రుగా ఉన్నారని ఆయన మాటలను బట్టే తెలుస్తోంది. పైగా జగన్ వ్యవహార శైలి గురించి బాగా అవగాహన ఉన్న కోటం రెడ్డి ఈసారి తనకు టికెట్ దక్కదని ఆలోచనకు కూడా వచ్చారని అందుకే ముందు జాగ్రత్తగా ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా కోటం రెడ్డి ఒక పధకం ప్రకారమే వ్యవహరిస్తున్నారు అని వైసీపీలో ఉన్న మాట. కోటం రెడ్డి వైసీపీలో ఉంటూ పార్టీని బదనాం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన మీద పార్టీ సీరియస్ గా ఉందని తేలడంతోనే ఆయన వేరే పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు టీడీపీకి ఆనందాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు

నెల్లూరులో టీడీపీకి పార్టీ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ వైపు మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి మరో వైపు కోటం రెడ్డి వంటి గట్టి నేతలు తమ వైపునకు వస్తే వెల్ కం చెప్పడానికి టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇక కోటం రెడ్డితోనే ఇది ఆగదని మరింతమంది కూడా పార్టీ గోడ దాటేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి మాత్రం ముచ్చెమటలు పోయించేలా ఉన్నాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.