Begin typing your search above and press return to search.

రగిలిపోతున్న జూనియర్ కోడెల వైసీపీ లోకి ...?

By:  Tupaki Desk   |   6 Jun 2023 9:00 PM GMT
రగిలిపోతున్న జూనియర్ కోడెల వైసీపీ లోకి ...?
X
తెలుగుదేశం పార్టీలో రగిలిపోతున్న నేతగ సత్తెనప్పల్లికి చెందిన కోడెల శివరాం ని చెప్పుకోవాలి. మాజీ స్పీకర్ మాజీ మంత్రి దివంగత కోడెల శివప్రసాద్ రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన కోడెల టికెట్ తీసుకుని పోటీ చేయకముందే టీడీపీ తో గ్యాప్ పెంచేసుకున్నారు. కోడెల శివప్రసాద్ మరణించిన దగ్గర నుంచి అధినేత చంద్రబాబు తో భేటీ కావాలని అప్పాయింట్మెంట్ కోరిన శివరాం కి అది దక్కలేదు.

మరో వైపు ఆయన ఆశించిన సత్తెనపల్లి టికెట్ కూడా రాదని తేలిపోయింది. తాజాగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అక్కడ ఇంచార్జిగా నియమితులయ్యారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయమన్న మాట. ఈ పరిణామంతో రగిలిపోతున్న కోడెల శివరాం తన అనుచరుల తో వరస సమావేశాల ను నిర్వహిస్తూ ఇండైరెక్ట్ గా టీడీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ఎన్ని చేసినా ఆయన కు టికెట్ దక్కే పరిస్థితి లేదు అంటున్నారు. మరో వైపు చంద్రబాబు అయితే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. దాంతో జూనియర్ కోడెల ఫ్యూచర్ అన్నది పూర్తిగా డౌట్ లో పడింది. టీడీపీ లో ఉంటే ఇక ఇంతే అని ఆయన భావిస్తున్నారుట.

తన తండ్రి పార్టీకి ఎంతో సేవ చేసి నిబద్ధతతో నడచుకున్నారని, చాలా చోట్ల వారసుల ను ప్రోత్సహించి టికెట్లు ఇచ్చిన అధినాయకత్వం కేవలం తన విషయం లో మాత్రం వివక్ష చూపించడం పట్ల శివరాం మండిపోతున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ తనను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని, అందువల్ల తాను కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా వదులుకోకుండా ముందుకు వెళ్లాల ని ఆయన ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన కూడా శివరాం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అయితే తీవ్రమైన నిర్ణయం కోడెల శివరాం తీసుకోరని పార్టీ భావిస్తోందిట. అందుకే పార్టీ పెద్దలు ఆయన ను కలసి నచ్చెచెబుతున్నారుట. టీడీపీ అధికారం లోకి వస్తే తప్పనిసరి గా న్యాయం చేస్తామని పార్టీ నాయకులు హామీ ఇస్తున్నారుట. అయితే అధినాయకత్వం నుంచి కచ్చితమైన హామీ కోసం మాత్రం శివరాం పట్టుబడుతున్నారని అంటున్నారు.

తనకు కనుక తగిన న్యాయం జరగక పోతే వైసీపీ లో అయినా చేరి టీడీపీ లో తన కు అన్యాయం చేసిన వారి సంగతి చూసుకోవాలని కోడెల శివరాం పట్టుదల గా ఉన్నట్లుగా చెబుతున్నారు. సత్తెనపల్లి లో టీడీపీ గెలిచిందే మూడు సార్లు. అలాంటిది ఇపుడు అక్కడ టీడీపీ లో వర్గ పోరు పెరిగితే అది పార్టీకి తీరని నష్టం అని అంతా భావిస్తున్నారు.

అయితే ఈ పరిణామాల ను అధికార వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది అని అంటున్నారు. జూనియర్ కోడెల ఆవేశాన్ని క్యాష్ చేసుకోవడాని కి వైసీపీ పావులు కదుపుతోంది అని అంటున్నారు. అయితే ఆయన ను ఎన్నికల్లో సహకరిస్తే కచ్చితంగా కీలక పదవి ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. మరి వైసీపీ నుంచి కీలక పదవి తీసుకుని టీడీపీ ని జూనియర్ కోడెల దెబ్బేస్తారా అన్నదే చర్చగా ఉంది మరి. ఏది ఏమైనా కోడెల ఫ్యామిలీ కి టీడీపీ అధినాయకత్వం అన్యాయం చేస్తోంది అన్న దాన్ని జూనియర్ కోడెల ద్వరా జనం లోకి బలంగా తీసుఖెళ్తే అది వైసీపీకి బాగా ఉపయోగపడుతుంది అని అధికార పార్టీ లెక్కలు వేస్తోందిట.