జూ.ఎన్టీఆర్ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Mon Aug 10 2020 13:40:59 GMT+0530 (IST)

Kodali Nani interesting comments on Jr.NTR

టీడీపీకి భవిష్యత్ లేదని.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఆ పార్టీకి భవిష్యత్ లేదని ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ పుంజుకునే అవకాశం లేదని.. టీడీపీకి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని.. ఇప్పుడు ఎవరు వచ్చినా టీడీపీని కాపాడే శక్తి లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.తెలంగాణలో టీడీపీ తుడుచిపెట్టుకుపోయిందని.. ఏపీలో సరైన పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎవరొచ్చినా టీడీపీ భవిష్యత్ లేదని స్పష్టం చేశారు.

తాను టీడీపీలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ తో ముందుకుసాగామన్నారు. కానీ 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత హరికృష్ణను పక్కనపెట్టడం.. జూనియర్ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. టీడీపీలో మనుగడ కష్టమని భావించే వైసీపీలో చేరానని మంత్రి వివరించారు.