Begin typing your search above and press return to search.

శ‌త‌జ‌యంతి వేళ‌నూ వ‌ద‌ల‌ని కొడాలి... స‌వాళ్ల శ‌ప‌థం!

By:  Tupaki Desk   |   28 May 2023 2:55 PM GMT
శ‌త‌జ‌యంతి వేళ‌నూ వ‌ద‌ల‌ని కొడాలి... స‌వాళ్ల శ‌ప‌థం!
X
దివంగ‌త ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. రాష్ట్ర‌వ్యాప్తంగాను.. దేశ‌వ్యాప్తంగా కూడా.. అన్న‌గారి అభిమానులు.. తెలుగు వారు సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో నూ వైసీపీ నాయ‌కుడు మాజీ మంత్రి కొడాలి నాని త‌న రాజ‌కీయాలు వ‌ద‌ల్లేదు. చంద్ర‌బాబు, నారా లోకేష్‌ పై స‌వాళ్లు రువ్వారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు, లోకేష్‌ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు. ఎన్టీఆర్ పేరుతో, ప్రజల కు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని, ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు, గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని నాని వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా, ఆకర్షణీయ మైన మేనిఫెస్టో పెట్టడానికి అని మండిపడ్డారు.

చంద్రబాబు కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని, చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్ను పోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ను తరిమికొట్టి, ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీ నం చేసుకుంటారని కొడాని నాని జోస్యం చెప్పారు.

దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు. అయితే.. శ‌త‌జ‌యంతి వేళ‌లోనూ ఇలా విమ‌ర్శ‌లు సంధించ‌డం స‌రికాద‌ని వైసీపీ లోని కొంద‌రు నాయ‌కులు గుస‌గుస‌లాడ‌డం గ‌మ‌నార్హం.