Begin typing your search above and press return to search.

మార‌ని కిమ్ తీరు..ఈ టైమ్‌ లోనూ అణ్వాయుధాల‌ పైనే ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   24 May 2020 10:30 PM GMT
మార‌ని కిమ్ తీరు..ఈ టైమ్‌ లోనూ అణ్వాయుధాల‌ పైనే ఫోక‌స్‌
X
అమెరికా ప‌క్క‌న ఉన్న చిన్న దేశం ఎగిరెగిరి ప‌డుతుంటుంది. భార‌త‌దేశంలోని ఒక రాష్ట్ర‌మంతా ఉండే ఆ దేశం అగ్ర‌రాజ్యంతో పాటు ప్ర‌పంచాన్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేలా ఆ దేశం వ్య‌వ‌హారం ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్‌తో ప్ర‌పంచ‌మంతా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతుంటే ఆ దేశం తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు. ఆ దేశం ఉత్తర కొరియా. ఆ దేశానికి అధ్యక్షుడే కిమ్ జోంగ్ ఉన్. మొద‌టి నుంచి కిమ్‌ వ్యవహారశైలి దారుణంగా ఉంటుంది. దీపావ‌ళిలో ప‌టాసులా మాదిరి నిరంతరం అణు పరీక్షలు చేస్తూ ప్రపంచ దేశాలను ఆందోళ‌న‌లో ప‌డే నైజం అత‌డిది. ఇన్నాళ్లు అనారోగ్యంతో స‌మాజానికి క‌నిపించ‌కుండాపోయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవ‌ల బ‌య‌ట క‌నిపించారు. మ‌ళ్లీ మాయ‌మ‌య్యారు. అయితే ఆయ‌న ఇప్పుడు స‌రికొత్త వ్యూహం ప‌న్నుతున్న‌ట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా ‘కేసీఎన్‌ ఏ’ ప్ర‌క‌టించింది. అంటే అణ్వాయుధ సంప‌ద ఫోక‌స్ పెట్టార‌ని తెలుస్తోంది.

దీనిపై సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ తో విస్తృత మంతనాలు జరిపినట్లు తెలిపింది. త‌మ‌ సైనిక బలగాల్ని పటిష్ఠం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చలు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఏడు ముఖ్యమైన నిర్ణయాలపై కిమ్ సంతకాలు చేసినట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వీటిలో ప్రధానంగా సైనిక విద్యాసంస్థల బాధ్యతలు, పాత్రను పెంచాలని, రక్షణ వ్యవస్థల మధ్య లక్ష్యాల్ని చేరుకునేలా మిలిటరీ కమాండ్‌ వ్యవస్థని పునర్‌వ్యవస్థీకరించాలని కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయించినట్లు తెలిపింది.

రక్షణ వ్యవస్థలోని రాజకీయ - సైనికపరమైన లోపాలపై చర్చించి వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని ఆ వార్త సంస్థ వెల్ల‌డించింది. సాయుధ దళాల సామర్థ్యాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే చాలా అణ్వాయుధాల‌ను పరీక్షించి ప్రపంచ దేశాల ఆందోళనకు గురిచేసిన విష‌యం తెలిసిందే. అత‌డి వ్య‌వ‌హారంపై ప్ర‌పంచం ఆందోళ‌న చెందుతోంది.

అయితే మొన్న అమెరికా 28 ఏళ్ల తర్వాత తొలిసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో కిమ్ అప్ర‌మ‌త్త‌మై ఈ మేర‌కు ప్ర‌తిగా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి ప్రారంభంలో ఓ క్షిపణిని ప్ర‌యోగించ‌గా, మ‌ళ్లీ ఇటీవ‌ల‌ నెల రోజుల వ్యవధిలోనే ఆరు క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ విధంగా కిమ్ వ్య‌వ‌హారం అంతుచిక్క‌డం లేదు.