చిన్న తప్పుకే.. మైనర్లకు మరణ శిక్ష విధించిన కిమ్ జోంగ్..!

Tue Dec 06 2022 20:53:43 GMT+0530 (India Standard Time)

Kim Jong Sentenced Minors to Death for a Small Mistake

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇద్దరు విద్యార్థులు దక్షిణ కొరియాకు చెందిన సినిమాలను.. అమెరికా నటక ప్రదర్శనలు చూసే కారణంతో కిమ్ జోంగ్ వారికి బహిరంగ మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. కిమ్ నిర్ణయం ఆ దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ కోరియాకు చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు చైనాతో సరిహద్దుగా ఉన్న ర్యాంగ్ గాంగ్ ఫ్రావిన్స్ లోని తమ స్నేహితులను కలుసుకునేందుకు వెళ్లారు. అక్కడే  వారితో సరదాగా గడిపిన విద్యార్థులు వారితో కలిసి దక్షిణ కొరియాకు చెందిన సినిమాలు.. అమెరికన్ నాటక ప్రదర్శనలను తిలకించారు. ఇదే వారి పాలిట మృత్యుపాశంగా మారింది.

నార్త్ కొరియన్లపై విదేశీయుల ప్రభావం ఉండకూడదనే కారణంతో కిమ్ జింగ్ విదేశీ సినిమాలను నిషేధించారు. అయితే నార్త్ కొరియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ర్యాంగ్ గాంగ్ ఫ్రావిన్స్ లో దక్షిణ కోరియా సినిమాలతో పాటు.. అమెరికన్ నాటక ప్రదర్శనలను వీక్షించారు. అంతేకాకుండా వీటిని తమ తోటి విద్యార్థులకు షేర్ చేశారు. ఇది కాస్తా ఆ నోటా ఈ నోటా వెళ్లి కిమ్ జోంగ్ వరకు చేరింది.

ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను బహిరంగంగా కాల్చి వేయాలంటూ కిమ్ జోంగ్ ఆదేశించారు. ఇతరులు ఎవరూ కూడా ఇకపై అలా చేయకూడదనే కిమ్ జోంగ్ అలా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజలే ముందే మైనర్లను దారుణంగా కాల్చివేయాలని ఆదేశించడం మాత్రం కిమ్ జోంగ్ లోని నిరంకుశత్వానికి అద్ధం పడుతోంది.

ఇక ఉత్తర కొరియాలో ఎలాంటి సినిమాలు చూడాలనేది కూడా కిమ్ జోంగే నిర్ణయిస్తాడు. ప్రజలకు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి? పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలనేది కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఇటీవలే పిల్లలకు బాంబు.. తుపాకీ.. శాటిలైట్ పేర్లు పెట్టాలని కిమ్ జోమ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు ఆ పేర్లనే పెడుతున్నారు.

ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలపై నిషేధం ఉండటంతో వారంతా అక్రమంగా సినిమాలను రవాణా చేస్తుకొని ఎవరి కంట పడకుండా వాటిని వీక్షిస్తున్నారు. అయితే తాజాగా కిమ్ జోమ్ ఇద్దరు మైనర్లకు బహిరంగంగా మరణ శిక్ష విధించడంతో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై వారంతా రహస్యంగా కూడా సినిమాలు చూసేందుకు జంకుతున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.