అమెరికాలో ఖరీదైన హ్యుందాయ్ కియా కార్ల దొంగతనం కలకలం రేపుతోంది. దీనివెనుక ఒక టిక్ టాక్ వీడియో ఉన్నట్టు సమాచారం. ఈ భారీ కార్ల దొంగతనం పోలీస్ శాఖకు సవాల్ గా మారింది. పదులు కాదు వందల వేల కార్లు ఇప్పుడు మాయం కావడం చర్చనీయాంశమైంది. ఇదంతా టిక్టాక్స్ తప్పు అని కొందరు విమర్శిస్తున్నారు.
ఇది 'కియా ఛాలెంజ్' అని పిలవబడే టిక్టాక్ వీడియోతో ప్రారంభించబడిందని అంటున్నారు. ఎలా దొంగతనం చేయాలో ఓ వినియోగదారు 'రోబరీయ్య్'(robbierayyy)తో ఓ వీడియో రూపొందించారు.
వినియోగదారు 2011 నుండి 2021 వరకు కియా మోడళ్లలో 2015 నుండి 2021 వరకు హ్యుందాయ్ మోడళ్లలో భద్రతా లోపాన్ని బహిర్గతం చేశారు. మొదట 2021లో ఈ దోపిడీ మొదలైంది. వారు కేవలం యూఎస్.బీ కార్డ్ని ఉపయోగించి నిర్దిష్ట కియా హ్యుందాయ్ మోడల్లను ఎంత సులభంగా హైజాక్ చేయవచ్చో చూపించారు.
టిక్ టాక్ త్వరగా ఆ వీడియోలను తీసివేసింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. మిల్వాకీలోనే 2020 నుండి కార్ల దొంగతనాలు రెట్టింపు అయ్యాయి. సెయింట్-లూయిస్లో అవి 2021 రెండవ సగం నుండి 2022 రెండవ సగం వరకు 157% పెరిగాయి. న్యూయార్క్ చికాగో మరియు లాస్ ఏంజిల్స్ వంటి ప్రధాన మెట్రోల్లో కూడా ఈ కియా హ్యూందాయ్ కార్ల దొంగతనాలు వేగంగా పెరిగాయి.
స్టేట్ ఫార్మ్ ప్రొఫ్రెసివ్ వంటి ప్రధాన బీమా కంపెనీలు కియా మరియు హ్యుందాయ్ యొక్క దొంగలించే మోడళ్లకు బీమా చేయడాన్ని కూడా నిలిపివేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దొంగిలించిబడిన కార్ల యజమానులు క్లాస్-యాక్షన్ వ్యాజ్యాలు కోర్టుల్లో వేశారు. రీకాల్ జారీ చేయమని లేదా కార్ల లోపాన్ని పరిష్కరించడానికి కంపెనీలను ఆదేశించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.
మొత్తంగా కియా హ్యూందాయ్ కార్లలోని లోపాలను గుర్తించి బయటపెట్టిన ఒక టిక్ టాక్ వీడియోతో ఇప్పుడు దొంగలు పెద్ద ఎత్తున ఈ కార్లను అపహరించడం అమెరికాలో కలకం రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.