Begin typing your search above and press return to search.

ఖలిస్థానీల దుశ్చర్య.. ఇంగ్లండ్ లో జాతీయ జెండాకు తీవ్ర అవమానం

By:  Tupaki Desk   |   20 March 2023 3:00 PM GMT
ఖలిస్థానీల దుశ్చర్య.. ఇంగ్లండ్ లో జాతీయ జెండాకు తీవ్ర అవమానం
X
ఇంగ్లండ్ లో భారత జాతీయ జెండా కు తీవ్ర అవమానం జరిగింది. భారత హై కమిషన్ కార్యాలయం భవనం పైనున్నజాతీయ జెండాను ఖలిస్థాన్ సానుభూతిపరులు తొలగించారు. ఆ స్థానంలో ఖలిస్థాన్ జెండాను ఎగురవేశారు. ఓ దేశ హై కమిషన్ కార్యాలయం వద్ద ఇలా చేయడం అంటే తీవ్రమైన చర్యనే. ఓ దేశ సార్వభౌమత్వాన్ని దారుణంగా అవమానించడమే. అందులోనూ ఇంగ్లండ్ వంటి దేశంలో భారత జాతీయ జెండా కు ఇలా జరగడం ఏమాత్రం ఉపక్షేంచదిగనది కాదు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్. ఆయా దేశాల్లో ఎన్నో ఘోరమైన నేరాలకు పాల్పడింది బ్రిటన్ సైన్యం. తమ గుప్పిట్లోని వలస దేశాల్ సంపదను ఆసాంతం ఎత్తుకెళ్లింది.

బ్రిటన్ వలస పాలనలో మగ్గిన ఇలాంటి దేశాలు తర్వాతి కాలంలో తీవ్రమైన పేదరికంలోకి జారిపోయాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు దాన్నుంచి బయటపడలేకపోతున్నాయి. ఇక భారత్ వంటి దేశాన్ని 200 ఏళ్లు పైగా పాలించి వెళ్తూవెళ్తూ రెండుగా చీల్చి.. రగిలించిన పాకిస్థాన్ రావణ కాష్ఠం ఇంకా రగులుతూనే ఉంది. బ్రిటిష్ పాలకులు చేసిన ఆ పాపం లక్షలాది ప్రాణాలను బలిగొంది. ఉగ్రవాదం రూపంలో కశ్మీర్ లో ఇంకా ప్రాణాలను తీస్తోంది.

ఖలిస్థానీల అడ్డా ఇంగ్లండ్ ఇంగ్లండ్ అంటేనే ఖలిస్థాన్ సానుభూతిపరుల అడ్డా. చాలా దేశాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడి ఉంటారు కాబట్టి భిన్న కల్చర్ ఉంటుంది. అది ఆ వైవిధ్యంతో ఆగితే బాగుంటుంది. కానీ, ఒక దేశానికి అందులోనూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్  కు వ్యతిరేకంగా జరిగే చర్యలకు వేదిక అయితే సహించరాని విషయమే. ఇప్పుడు ఇంగ్లండ్ లో భారత హై కమిషన్ కార్యాలయం వద్ద మన జాతీయ జెండాను కిందికి దించి ఖలిస్థాన్ జెండా ఎగురేసిన ఉదంతం ఇలాంటిదే. కాగా, ఇంగ్లండ్ ఎప్పటినుంచో ఖలిస్థాన్ సానుభూతిపరులకు వేదికగా ఉంది. ఇటీవల అక్కడ ఖలిస్థాన్ అనుకూల శక్తులు మళ్లీ గొంతెత్తున్నాయి.

ఆ కోవలోనే.. పంజాబ్ వారిస్ దే అధినేత, వివాదాస్పద మత గురువు అమ్రత్ పాల్ సింగ్ ను పోలీసులు వెంటాడడం, అతడు మూడు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్ లోని ఖలిస్థాన్ శక్తులు ఉనికి చాటుతున్నాయి. కాగా, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియాలో జాతీయ జెండాతో ప్రదర్శనగా వెళ్తున్న ప్రవాసులపై కొందరు ఖలిస్థాన్ అనుకూలురు దాడి చేశారు. అంతకుముందు ఏడాది 2021లోనూ రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమంలో చేరిన ఖలిస్థాన్ శక్తులు చేరాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేసినట్లుగా కథనాలు వచ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.