Begin typing your search above and press return to search.

అవినీతి ఆరోపణల్లో 'ఖాకీ'.. బీహార్ ఐపీఎస్ కు చిక్కులు..!

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:30 PM GMT
అవినీతి ఆరోపణల్లో ఖాకీ.. బీహార్ ఐపీఎస్ కు చిక్కులు..!
X
బీహార్ రాష్ట్రంలో ఐపీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అమిత్ లోడాకు ఆ ప్రాంతంలో మంచి పాపులారిటీ ఉంది. ఆయన ఐపీఎస్ గానే కాకుండా మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన 'బీహార్ డైరీస్' అనే పుస్తకాన్ని సైతం రాశారు. ఈ పుస్తకం ఆధారంగా 'ఖాకీ: ది బీహార్ ఛాప్టర్' అనే వెబ్ సిరీస్ సైతం విడుదలైంది.

ఒకే 24 హత్యలకు పాల్పడి బీహార్లో మోస్ట్ వాటెండ్ క్రిమినల్ గా మారిన ఓ వ్యక్తిని ఓ పోలీస్ అధికారి ఎలా పట్టుకున్నాడనే కథంతో 'ఖాకీ: ది బీహార్ ఛాప్టర్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీసు ఇటీవలే ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫిక్స్' లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ వెబ్ సిరీసుకు మంచి ఆదరణ లభిస్తుండటంతో బీహార్లో అమిత్ లోడా పాపులర్ గా మారాడు.

అయితే అమిత్ లోడా తాజాగా అవినీతి ఆరోపణల్లో ఇరుక్కుపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాలకు అమిత్ లోడా వాడుకుంటున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు అమిత్ లోడా ప్రముఖ నిర్మాణ సంస్థతో కేవలం ఒక్క రూపాయికే ఒప్పందం చేసుకున్నాడు. అయితే అతడి భార్య బ్యాంకు ఖాతాలోకి ఆ నిర్మాణ సంస్థ 49 లక్షలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మేరకు ఐపీఎస్ అమిత్ లోడాపై అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వెబ్ సిరీసు ఒప్పందానికి ముందే లోడా భార్య ఖాతాలో డబ్బు జమైందని అధికారులు చెబుతున్నారు. లోడా మగధ్ రేంజ్ ఐజీగా ఉన్నప్పుడే ఈ ఒప్పందం కుదిరిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

కాగా గయలో ఐజీలో అమిత్ నియామకం అయినప్పటి నుంచే అతడు అవినీతికి పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక అతడి పుస్తకాలు వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అనుమతి ఉండదని అమిత్ షాపై ఫిర్యాదు వచ్చింది. ఈ కేసును ఓ డీఎస్పీ స్థాయి అధికారి విచారిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.