Begin typing your search above and press return to search.

కారు సెక్యూరిటీలో కీలక మార్పులు చేసిన కేంద్రం

By:  Tupaki Desk   |   11 Feb 2022 11:30 PM GMT
కారు సెక్యూరిటీలో కీలక మార్పులు చేసిన కేంద్రం
X
కార్లలో రక్షణ చర్యలను మరింతగా కేంద్రం పటిష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే సెక్యూరిటీకి పెద్దపీట వేస్తోంది. కార్లలో వెనుకాల కూర్చునే వారికి సీట్ బెల్ట్ ను తప్పనిసరి చేస్తోంది. ఈ మేరకు 'త్రీ పాయింట్ సీట్ బెల్ట్'ను కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై బుధవారమే సంతకం చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు.

ప్రస్తుతం కొన్ని కార్లలో ముందు సీట్లకు, వెనుక రెండు సీట్లకు త్రీపాయింట్ సీట్ బెల్ట్ లున్నాయి. ఇటీవల కార్లలో వెనుక భాగంలోని మధ్య సీట్లకు, వెనుక రెండు సీట్లకు త్రీపాయింట్ సీట్ బెల్ట్ లున్నాయి.

అయితే ఇటీవల కొన్ని కార్లలో వెనుక భాగంలోని మధ్య సీటుకు 'టూ పాయింట్ సీట్ బెల్ట్ ' ఉంటోంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మధ్య సీటులోని వారికి ప్రాణాపాయ ముప్పు, గాయాలపాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున మధ్య సీటును కూడా 'త్రీపాయింట్ సీట్ బెల్ట్' ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

అయితే కేంద్రం ఈ నిబంధనను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే ఎయిర్ బ్యాగులను ముందు తప్పనిసరి చేసింది కేంద్రం. ఇక కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్6 ఇంజిన్లను కార్లలో పెట్టాలని వాహన తయారీ కంపెనీలకు స్పష్టం చేసింది. ఇక సెక్యూరిటీ పర్సస్ లో మరిన్ని చర్యలు తీసుకుంటోంది.

ప్రజల రక్షణ కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని.. ఇక నుంచి వాహనాల్లో ఇవి తప్పనిసరి అని కేంద్రం ఈ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.