అప్పుడు ఒంటెలు.. ఇప్పుడు పక్షులు.. చంపేస్తున్న దేశాలు!

Fri Jan 27 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Kenya Declares War on Millions of Birds

ఔను! ఓ రెండేళ్ల వెనక్కి వెళ్తే.. ఆస్ట్రేలియా దేశంలో నీటి ఎద్దడి ఏర్పడింది.దీంతో ప్రజలు చెలమలను వెతుక్కుం టూ.. నీటి కోసం.. కొన్ని కిలో మీటర్ల దూరం పయనించేవారు. అదేసమయంలో ఎడారి ఓడగా పేరున్న ఒంటెలు కూడా నీటిని ఎక్కువగా తాగేయడంతో.. చెలమల్లోనూ నీటి చుక్కదక్కలేదు.దీంతో ప్రజలుదాహార్తిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వమే సైన్యాన్ని రంగంలోకి దింపి.. వేల సంఖ్యలో ఒంటెలను హత మార్చిన ఘటన ప్రపంచాన్ని సైతం నివ్వెర పోయేలా చేసింది.

ఇక ఇప్పుడు.. కెన్యాలో ప్రభుత్వమే పక్షులను చంపేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకువచ్చింది. అంతేకాదు.. దీనిని యుద్ధపప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు కూడా ఏపట్టింది. దీనికి కారణం.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కళ్లముందే ఆ పక్షలు నాశనం చేయడం.

పక్షుల బెడదను తట్టుకోలేక ఏకంగా కెన్యా ప్రభుత్వమే రంగంలోకి దిగి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని నిర్ణయించింది.  2021లో భారత్లోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు పొలాలపై దాడి చేశాయి. అచ్చం అలానే కెన్యాలో కూడా క్యూలియా పక్షులు అక్కడి వరి పొలాలపై గుంపులుగా వాలి మూడొంతుల పంటను తినేస్తున్నాయి.

అసలే కరవుతో అల్లాడుతున్న కెన్యా ఈ పిచ్చుకల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అక్కడి ప్రభుత్వం ఆఖరి అస్త్రంగా సుమారు 60 లక్షల క్యూలియా పక్షులను చంపాలని నిర్ణయించింది. క్యూలియా పక్షులు అచ్చం పిచ్చుకల్లా ఉంటాయి.  ఈ పక్షులు పెద్ద ఎత్తున సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి ప్రధానంగా గడ్డి విత్తనాలు తింటాయి.

కెన్యాలోని కొన్ని ప్రాంతాల్లో మూడొంతుల పంటలను క్యూలియా పక్షులు తినేస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్ద ఎత్తున క్రిమిసంహాకరాలను వాడి పక్షులను మట్టుబెడుతున్నారు. కెన్యా ప్రభుత్వం కూడా స్వయంగా రంగంలోకి దిగి ఏకంగా 60 లక్షల క్యూలియా పక్షులను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయనుంది.  ఇదీ.. సంగతి!!   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.