Begin typing your search above and press return to search.

కరాటే మేడం మళ్ళీ లొల్లి.. ఈసారి చైల్డ్‌ లేబర్‌

By:  Tupaki Desk   |   16 May 2022 9:27 AM GMT
కరాటే మేడం మళ్ళీ లొల్లి.. ఈసారి చైల్డ్‌ లేబర్‌
X
తీగ లాగితే డొంక కదిలినట్లు కరాటే కళ్యాణి ఒక విషయంలో పోలీసుల వద్దకు వెళ్తే అది కాస్త చిలికి చిలిక గాలి వాన మాదిరిగా మారుతోంది. ఒక యూట్యూబర్ తో గొడవ తో కరాటే కళ్యాణి ఈసారి వార్తల్లో నిలిచింది. ఆ యూట్యూబర్ మరియు కరాటే కళ్యాణి ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. దాంతో వివాదం ముగిసినట్లే అనుకుంటూ ఉండగా కరాటే కళ్యాణి ఇష్యూలు.. బాధితులు బయటకు వస్తున్నారు.

ఒక ప్రాపర్టీ కొనుగోలు విషయంలో కరాటే కళ్యాణి తమను మూడున్నర లక్షలు మోసం చేసిందంటూ ఒకరు... ఒక రేప్ కేసులో బాధితురాలి ఫోటో బయటకు ఇచ్చినందుకు కరాటే కళ్యాణి ని ప్రశ్నించినందుకు చంపేస్తానంటూ బెదిరిస్తుంది అంటూ మరొకరు ఇలా రోజుకు ఎవరో ఒకరు అన్నట్లుగా కరాటే కళ్యాణి గురించి చెప్పేందుకు మీడియా ముందుకు వస్తున్నారు.

కొందరు పోలీసుల వద్దకు వెళ్తూ ఉంటే కొందరు మాత్రం మీడియా వద్ద తమకు సంబంధించిన విషయాలను గురించి చెబుతున్నారు. మొత్తానికి కరాటే కళ్యాణి కి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా తలుగుతోంది. ఈ సమయంలో ఈసారి కరాటే కళ్యాణి కి ఏకంగా చైల్డ్ లేబర్ కేసు మెడకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కరాటే కళ్యాణి ఇంట ఒక చిన్న అమ్మాయి ఉంటుందని చైల్డ్ లేబర్ అధికారులకు సమాచారం అందిందట. దాంతో అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారట.

ఆ సమయంలో సదరు అధికారులకు ఒక అమ్మాయి లభించిందట. ఆ అమ్మాయికి సంబంధించిన విషయాల్లో స్పష్టత కరువయ్యిందని.. దాంతో కరాటే మేడం పై కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

కరాటే కళ్యాణి తరపు వారు మాత్రం ఆ పాప తెలిసిన వాళ్లకు మూడవ అమ్మాయి. ఆమెను దత్తత తీసుకుని కరాటే కళ్యాణి చదివించి ఉన్నతంగా మార్చాలని భావిస్తుందని అంటున్నారు. త్వరలోనే దత్తతకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా వారు చెబుతున్నారు. అది నిజం కాదని తేలితే మాత్రం ఖచ్చితంగా కరాటే కళ్యాణి చిక్కుల్లో పడే అవకాశాలు లేకపోలేదు.