Begin typing your search above and press return to search.

ఇద్దరు కెప్టెన్లు కుదరని పని..! క్లారిటీగా చెప్పేసిన కపిల్​దేవ్​! రోహిత్​ ఫ్యాన్స్​ ఏమంటారో?

By:  Tupaki Desk   |   21 Nov 2020 11:30 PM GMT
ఇద్దరు కెప్టెన్లు కుదరని పని..! క్లారిటీగా చెప్పేసిన  కపిల్​దేవ్​! రోహిత్​ ఫ్యాన్స్​ ఏమంటారో?
X
ఐపీఎల్​ 2020లో ముంబై ఇండియన్స్​ విజయం సాధించాక.. రోహిత్​ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్​ పెరుగుతున్నది. సోషల్​మీడియా వేదికగా అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్​ శర్మను టీం ఇండియాకు కెప్టెన్​గా చేయాలని.. కొన్ని మ్యాచ్​లకు కోహ్లీని, మరికొన్ని మ్యాచ్​లకు రోహిత్​కు కెప్టెన్​గా కొనసాగించాలని కోరుతున్నారు. ఒక టీంకు ఇద్దరు కెప్టెన్​లు ఉంటే తప్పేంటని అనేవారూ ఉన్నారు. మరోవైపు టీ20కి రోహిత్​ను కెప్టెన్​ చేయాలన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది.

ఐపీఎల్​ 2020లో విరాట్​ కోహ్లి విఫలమయ్యారు.. కాబట్టి టీ20లో కచ్చితంగా రోహిత్​కే అవకాశం ఇవ్వాలని కొందరు డిమాండ్​ చేస్తున్నారు. మరోవైపు గౌతమ్ గంభీర్ అయితే రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోతే దేశానికే నష్టమనే వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే ఈ విషయంపై కపిల్​దేవ్​ భిన్నంగా స్పందించారు. ఓ కంపెనీకి ఇద్దరు సీఈవోలు ఉండటం ఎలాగైతే సాధ్యం కాదో? అలాగే ఓ జట్టుకు ఒకరే కెప్టెన్​గా ఉంటారు. 'మన భారత క్రికెట్ సంస్కృతిలో కెప్టెన్సీ విభజన సాధ్యం కాదు. విరాట్ కోహ్లీ టీ20ల్లో ఆడుతుంటే.. కెప్టెన్‌గానూ అతడినే కొనసాగించాలి. అతడు బాగానే ఆడుతున్నాడు. జట్టు‌లో మరో కెప్టెన్‌ కూడా ఉండాలనే నిర్ణయాన్ని నేనూ స్వాగతిస్తా.

కానీ అది చాలా కష్టం. కెప్టెన్సీ విభజన చాలా కష్టం. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలో దాదాపుగా 70-80 శాతం ఒకటే జట్టుతో భారత్ వన్డే, టీ20, టెస్టు జట్టులో ఆడుతుంటుంది. సారథులు విరుద్ధమైన పద్ధతులు అవలంభిస్తే.. వారికి ఆటగాళ్లకు నచ్చవు. వారి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరు సారథులు ఉంటే జట్టు వాతావరణం మారిపోతుంది. ఫలానా వ్యక్తి టెస్టుల్లో సారథి కాబట్టి అతడికి కోపం తెప్పించకూడదని.. ఆటగాళ్లు ఆలోచిస్తారు' అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నారు.