సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. రాహుల్ మానసిక ధైర్యాన్ని ఇచ్చాడన్న నటి

Fri Mar 31 2023 09:56:41 GMT+0530 (India Standard Time)

Kannada actress cum former MP Divya

కన్నడ నటి కమ్ మాజీ ఎంపీ దివ్య స్పందన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక టాక్ షాలో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకదశలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు హెడ్ గా వ్యవహరించిన ఆమె.. మాండ్య నుంచి 2013లో జరిగిన ఉప ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించటం తెలిసిందే. 2012లో యూత్ కాంగ్రెస్ లో చేరిన ఆమె 2013లో జరిగిన ఉపఎన్నికల్లో సీటు సొంతం చేసుకోవటంతో ఎంపీగా మారారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉండేదానినంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు.''మాండ్య ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను ఎంపీని చేశారు. నా తండ్రి చనిపోయిన రెండు వారాలకు పార్లమెంటుకు వెళ్లాను. అక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరు. అసలేమీ తెలీదు. పార్లమెంటు కార్యకలాపాలపై ఐడియా లేదు. చిన్నగా విషయాల్ని తెలుసుకోవటం ప్రారంభించా. పనిలో పడి నా బాధను తగ్గించుకునే ప్రయత్నం చేశా. నా తండ్రి దూరమైన వేళ నాకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు వచ్చాయి. రాహుల్ గాంధీ మానసికంగా చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అండగా నిలిచారు. అమ్మ ప్రభావం ఎంతో ఉంది. ఆమె తర్వాత నాన్న.. ఆ తర్వాత మూడో స్థానంలో రాహుల్ నిలుస్తారు'' అంటూ చెప్పుకొచ్చారు.

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. దివ్య స్పందన చేసిన  వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల నుంచి మళ్లీ సినిమా రంగంలోకి వచ్చిన ఆమె సొంతంగా ప్రొడక్షన్ హౌస్ షురూచేశారు. మళ్లీ.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.రాహుల్ గాంధీ పాదయాత్ర వేళలోనూ.. ఆమె రాహుల్ వెంట నడవటం.. అప్పట్లో ఆ ఫోటోలు ప్రముఖంగా పబ్లిష్ కావటం తెలిసిందే.