హిందుత్వంపై వ్యాఖ్యలు… కన్నడ హీరో అరెస్ట్

Tue Mar 21 2023 19:38:57 GMT+0530 (India Standard Time)

Kannada actor Chetan Kumar Ahimsa arrested over Hindutva tweet

ఈ మధ్యకాలంలో దేశంలో హిందుత్వ భావజాలాన్ని ద్వేషించే వారు ఎక్కువ అయిపోయారు. హిందుత్వ విశ్వాసాలని నమ్మకాలపై కూడా ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారిపోయింది. అయితే సామాన్యులు చేసారంటే ఏదో అనుకోవచ్చు. కాని సెలబ్రిటీలు కూడా ఈ రకమైన హిందుత్వ వ్యతిరేక భావజాలంతో వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారుతున్నారు. తమిళ్ కన్నడ రాష్ట్రాలలో ఎక్కువగా పెరియార్ ని ఫాలో అవుతూ ఉంటారు.  పెరియార్ ని ఫాలో అయ్యే వారిలో హిందుత్వ సిద్దాంతాలు కథలు గ్రందాలపై సరైన ఒపీనియన్ ఉండదు. ఇదిలా ఉంటే తాజాగా కన్నడ యువ హీరో చేతన్ కుమార్ ట్విట్టర్ లో హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్తా వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దళిత్ ట్రైబల్ హక్కుల కోసం ఎక్కువగా మాట్లాడే చేతన్ కుమార్ తాజాగా హిందుత్వంపై ఒక పోస్ట్ పెట్టారు. హిందుత్వం అనేది అబద్ధపు పునాదుల మీద నిర్మితం అయ్యింది.

రాముడు రావణుడిని చంపి అయోధ్య తిరిగి వచ్చినపుడు ఈ భరతఖండం ఏర్పడింది అని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధం. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో అయోధ్య జన్మించాడు అని చెప్పే కథ అబద్ధం. ఊరిగౌడ నంజేగౌడ టిప్పు సుల్తాన్ ని చంపారు అనేది అబద్ధం. హిందుత్వాన్ని సత్యం ద్వారా ఓడించవచ్చు. సమాజంలో సమానత్వమే నిజమైన సత్యం అంటూ పోస్ట్ చేశారు. దీనిని ఇంగ్లీష్ తో పాటు కన్నడంలో కూడా ట్విట్టర్ లో పెట్టారు.

ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో బెంగుళూరులోని శేషాద్రిపురం పోలీసులు అతనిని అరెస్ట్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరు పరిచారు. అయితే చేతన్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ పై కర్ణాటకలోని బీజేపీ నాయకులు హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేస్తున్నాయి. ప్రజలలో అశాంతిని పెంచి హిందువులపై ద్వేషం చిమ్మే ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.