Begin typing your search above and press return to search.

వ్యూహం మార్చిన కవిత.. ప్రజలకు చేరువ

By:  Tupaki Desk   |   22 Feb 2021 2:30 AM GMT
వ్యూహం మార్చిన కవిత.. ప్రజలకు చేరువ
X
నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత సంవత్సరం పాటు ఆ జిల్లా ముఖం చూడలేదు. ఈ మధ్యనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మళ్లీ క్రియాశీలకంగా మారారు. ఎంపీగా ఉన్న ఢిల్లీలో టీఆర్ఎస్ రాజకీయాలను ఏలిన కవిత ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

తాజాగా నెలలో ఐదురోజుల పాటు జిల్లాలోనే పర్యటించాలని కేసీఆర్ కుమార్తె కవిత నిర్ణయించుకుంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె భావిస్తోంది.

గతంలో ఎంపీగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి జిల్లాకు వచ్చే కవిత.. కేవలం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకే పరిమితం అయ్యేవారు. సామాన్య ప్రజలు, కార్యకర్తలను కలిసే తీరిక ఉండేవారు కాదు.

ఇప్పుడు అలా కాకుండా జిల్లా వాసులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు , ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరంలోని కవిత కార్యాలయం మళ్లీ కిటకిటలాడుతోంది. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు.

2019 ఎన్నికల్లో పసుపుబోర్డు అంశం తెరపైకి రావడం .. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని ప్రకటించడం కవితక ఓటమికి కారణమైంది.కానీ ఇప్పుడు పసుపు బోర్డు తేకపోవడంతో రైతుల్లో అరవింద్ విలన్ అయ్యారు.ఆయనను నిలదీస్తున్నారు.

ప్రస్తుతం వీలైనంతగా ప్రజలతో కవిత కలిసిపోతున్నారు. బీసీలు, ప్రజాప్రతినిధులకు అండగా ఉంటున్నారు. బీసీ సంఘాలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. జిల్లాలో బీసీ భవన్ నిర్మిస్తున్నారు. ఇలా యాక్టివ్ అయిన కవిత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.