Begin typing your search above and press return to search.

రేవంత్ కౌంటర్ కు ఎప్పటిలా రియాక్టు కాని కేటీఆర్

By:  Tupaki Desk   |   18 March 2023 9:42 AM GMT
రేవంత్ కౌంటర్ కు ఎప్పటిలా రియాక్టు కాని కేటీఆర్
X
మాట అన్నంతనే చర్రున చెలరేగిపోయే తత్త్వం మంత్రి కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి వచ్చే విమర్శలకు అంతే ఘాటుగా రియాక్టు కావటం ఆయనకు అలవాటే. అలాంటి మంత్రి కేటీఆర్ తాజాగా టీపీసీసీ ఫైర్ బ్రాండ్ రేవంత్ ఇచ్చిన ఘాటు కౌంటర్ కు మాత్రం కామ్ గా ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది. రేవంత్ మాటలకు సమాధానం చెప్పలేని ఇబ్బందికర పరిస్థితే కారణమని చెప్పాలి.

ప్రతి ఒక్కరి నుంచి అడగటమే తప్పించి.. ఇచ్చే విషయంలో కరకుగా వ్యవహరించే కేసీఆర్ అండ్ కో కు తాజాగా రేవంత్ ఇచ్చిన సమాధానం సూటిగా తాకేలా మారటమే కాదు.. నోటి వెంట మాట రాని రీతిగా మారింది. అందుకే మంత్రి కేటీఆర్ మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బలమైన కౌంటర్ ఇచ్చిన రేవంత్ మాటలు వైరల్ గా మారటమే కాదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి.

అరవై ఏళ్ల కలను సాకారం చేసిన కాంగ్రెస్ ను సైతం ఏం చేశారని అడుగుతున్నారు? అసలు మీరేం చేశారు? అన్న మాట పలువురి నోటి వెంట వస్తున్న పరిస్థితి. కేటీఆర్ తీరు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరినైనా సరే.. మీరేం ఇచ్చారు? మీరేం చేశారు? అని అడిగే కేటీఆర్.. గడిచిన పదేళ్లలో ఏం ఇచ్చారు? అసలేం చేశారు? అన్నది ప్రశ్నలుగా మారాయి.

ఇలాంటి వేళలోనే సీన్లోకి వచ్చిన రేవంత్ .. ఘాటుగా రియాక్టు అయ్యారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే ఈ రోజున పదవులు అనుభవిస్తున్న మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్న రేవంత్.. ‘‘సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే నీ అయ్య సీఎం, నువ్వు, నీ బావ మంత్రులు.. నీ చెల్లెలు ఎమ్మెల్సీ అయ్యింది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న వైభవానికి కారణం కాంగ్రెస్ పార్టీనే’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సాధారణంగా తాను చేసిన వ్యాఖ్యలపై రియాక్టు అయ్యే వారికి బలమైన కౌంటర్ ఇవ్వటం కేటీఆర్ కు అలవాటు. కానీ.. ఫైర్ బ్రాండ్ రేవంత్ నోటి నుంచి వచ్చిన కౌంటర్ కు మాత్రం ఆయన రియాక్టు కాకుండా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి. రేవంత్ మాటలకు ఏ రీతిలో రియాక్టు అయినా.. నష్టమే తప్పించి లాభం ఉండదన్న విషయాన్ని అర్థం చేసుకునే కౌటీఆర్ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.