Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంట్రాక్టర్లకు కేటీఆర్ వార్నింగ్ ...ఎందుకంటే !

By:  Tupaki Desk   |   26 Feb 2020 5:45 AM GMT
తెలంగాణ కాంట్రాక్టర్లకు కేటీఆర్ వార్నింగ్ ...ఎందుకంటే !
X
తెలంగాణ మంత్రి , టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సీఎం తనయుడు కేటీఆర్ ..రాజకీయాలలో డైనమిక్ లీడర్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా కూడా పరిష్కరిస్తారు అని ప్రజలల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు మెచ్చే ప్రజానాయకులు దొరకడం చాలా అరుదు. అలాంటి అరుదైన నాయకులలో కేటీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నిర్మాణాన్ని చూసుకుంటూ .. మరోవైపు మంత్రిగా తన బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు.

ఇకపోతే , మరో ఏడాది లో హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, టి ఆర్ ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. హైదరాబాద్ లో పట్టు కోల్పోకుండా ఉండాలని , ఇప్పటినుండే కేటీఆర్‌ నగరంలోని పలు అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ..జీహెచ్‌ ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ‘చైనాలో 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించారు. మన వద్ద వంతెన లేదా రోడ్డు నిర్మించాలంటే ఏళ్లు పడుతోంది. గుంతల రహదారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని కాంట్రాక్టర్స్ పై అసహనం వ్యక్తం చేశారు. అలాగే , కాంట్రాక్టర్లకు మంత్రి కేటీఆర్ కీలకమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాల విషయంలో పక్కాగా ఉండాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

అసలు ప్రైవేటు సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టులు ఇస్తే పరిస్థితి మెరుగవుతుందనుకుంటే ఇంత అధ్వానమా? అని ప్రశ్నించారు. ‘మీ వల్ల అయితే చేయండి.. లేదంటే వదిలేయండి.. ఇక తెలంగాణ లో ఎక్కడా పనులు చేయలేరు’ అంటూ కాంట్రాక్టర్ల కి వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించారు. జాప్యాలకు గల కారణాలు తనకు చెప్పొద్దని.. తుది దశలో ఉన్న పనులు మే నాటికి, పురోగతిలో ఉన్నవి అక్టోబరు కు పూర్తి చేయాలని అధికారులను ఫైనల్‌గా ఆదేశించారు. అలాగే ,రహదారుల పరిస్థితి మెరుగుకు ఉద్దేశించిన సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ) పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ సమయంలోనే చైనా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఒకవైపు చైనా కరోనా వైరస్ తో బాధపడుతున్నప్పటికీ ... 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించారు. అక్కడ అమలవుతున్న సాంకేతికను మనం కూడా అందిపుచ్చుకోవాలని, పాత పద్ధతులు మానుకొని , కొత్త పద్దతులపై అలవాటుపడాలని కోరారు. అలాగే , కావాలంటే ఓసారి చైనాకు వెళ్లి అక్కడి సాంకేతికత ను ఒకసారి పరిశీలించి , ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.