Begin typing your search above and press return to search.

ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన ప్రకటన.. అదే ఓట్లు కురిపిస్తుందట..

By:  Tupaki Desk   |   7 Feb 2023 12:00 PM GMT
ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన ప్రకటన.. అదే ఓట్లు కురిపిస్తుందట..
X
తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత కేసీఆర్ ఎన్నికల వెదర్ కల్పిస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ అధినేత కొత్త స్కీంలు ప్రకటిస్తారని తెలుస్తోంది. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే పలు కొత్త పథకాలను తీసుకొస్తారని భావించారు. కానీ పాత వాటికే నిధులు కేటాయించారు. దీంతో ఏవీ ప్రజలను ఆకట్టుకోలేనదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.

2018 ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ బడ్జెట్ లో ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదు. కానీ ఎన్నికల ముందు 'రైతు బంధు'ను తీసుకొచ్చి ఆకట్టుకున్నారు. ఆ పథకమే మరోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైందని తెలుస్తోంది. ఇప్పుడు కూడా బడ్జెట్ లో కాకుండా ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలను ఆకట్టుకునేలా కొత్త పథకాన్ని తీసుకొస్తారనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే..?

కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ఓ సంచలన ప్రకటన చేశారు. త్వరలో రైతులు, దేశం అబ్బుర పరిచే సరికొత్త పథకాన్ని తీసుకొస్తానని, వారంలో రోజుల్లోనే రైతులు తీపి కబురు వింటారని అన్నారు. కానీ నెలలు దాటినా ఆ పథకం గురించి బయటపెట్టలేదు.

అయితే దానిని అలగే హోల్డ్ లో ఉంచి.. ఇప్పుడు వచ్చే ఎన్నికల ముందు ప్రకటిస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడానికి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఈ స్కీం ఉపయోగపడుతుందని అంటున్నారు.

2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ 'రైతు బంధు' ను ప్రకటించారు. ఆ తరువాత ఇప్పటి వరకు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో పెట్టుబడి మొత్తాన్ని అందిస్తున్నారు. దీంతో రైతుబంధు విషయంలో కేసీఆర్ పై రైతులకు నమ్మకం ఏర్పడింది. అలాగే ఇప్పుడు రైతులకు పెన్షన్ కూడా అందించాలని చూస్తున్నారట. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా తమ ప్రభుత్వం సాటి చెబుతుందని చెప్పడానికి ఈ పథకాన్ని తీసుకొస్తారని అంటున్నారు. ఆసరా పింఛన్ మాదిరిలాగే రైతులకు కూడా నెలనెల పింఛన్ ఇచ్చే విధంగా రూప కల్పన చేస్తారని అంటున్నారు.

ఈ పథకం తెలంగాణలో హ్యాట్రిక్ సాధించడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు సందర్భంగా 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే ట్యాగ్ ఇచ్చారు. దీంతో తాము రైతుల కోసమే పనిచేస్తామని చాటి చెప్పనున్నారు. ఈ స్కీంతో తెలంగాణలో సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా ఇదే నినాదంతో వచ్చే ఎన్నికల్లోకి వెళ్లనున్నారు.

అయితే రైతుబంధు, రైతుబీమాలు సక్సెస్ అయినా.. రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. రైతులకు ఉచితంగా వీటిని సరఫరా చేస్తే పెద్దగా భారంపడే అవకాశం లేదు. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు రైతులకు పెన్షన్ ను ప్రకటించడం ద్వారా రైతుల ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. మరి ఈ పథకాన్ని కేసీఆర్ ఎలా బయటకు తెస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.