Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాల్లో ఎదురుగాలి ?

By:  Tupaki Desk   |   30 May 2023 4:00 PM GMT
జాతీయ రాజకీయాల్లో ఎదురుగాలి ?
X
క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరైపోయినట్లే అనిపిస్తోంది. ఏ విషయంలో కూడా ఇటు ఎన్డీయే కానీ అటు యూపీయే కానీ కేసీయార్ ను పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ అని కొంతకాలం హడావుడిచేసిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా కేసీయార్ కు దూరంగానే ఉంటున్నారు. మొత్తంమీద చూస్తే కేసీయార్ తో సఖ్యతగా ఉన్నది ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్ప ఇంకెవరూ కనబడటంలేదు.

ఒకపుడు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని చాలా హడావుడి చేసిన విషయం తెలిసిందే. హడావుడిలో భాగంగా మమత, శివసే అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిస్సా చీఫ్ మినస్టర్ నవీన్ పట్నాయక్, తమిళనాడులో స్టాలిన్ లాంటి వాళ్ళతో కేసీయార్ చాలా భేటీలు వేశారు. ఇంకేముంది కేసీయార్ జాతీయ రాజకీయాల్లో ఎంటరవ్వటమే ఆలస్యం భూకంపాలు వచ్చేస్తాయన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు.

కొంతకాలం తర్వాత చూస్తే గుండుసున్నా. కేసీయార్ చేసిన స్వీయ తప్పిదాలే ఇప్పటి పరిస్ధితికి కారణమని చెప్పాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే తనని తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటంతో పాటు కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయటమే.

కాంగ్రెస్ సహకారం లేకుండా బీజేపీని దెబ్బకొట్టడం ఏ పార్టీ వల్లా కాదన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ కు తానే ప్రత్యామ్నాయం కావాలని కేసీయార్ కోరుకున్నారు. ఇక్కడే సమస్య మొదలై మిగిలిన పార్టీలు దూరం పెట్టేశాయి.

ఇపుడు కేజ్రీవాల్ ఒక్కరే ఎందుకు సఖ్యతగా ఉన్నారంటే కారణముంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో పాటు కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే కేజ్రీవాల్, కవిత ఇద్దరూ ఒకే సమస్యలో ఇరుక్కున్నారు కాబట్టే సఖ్యతగా ఉన్నారు.

రేపు కేజ్రీవాల్ సమస్యలో నుండి బయటపడిపోతే తాను కూడా కేసీయార్ తో ఉండరేమో. మొత్తంమీద ఇపుడు జాతీయ స్ధాయిలో ఏ పార్టీ కూడా కేసీయార్ ను పట్టించుకోవటం లేదన్నది వాస్తవం.