Begin typing your search above and press return to search.

రాజ్ భవన్ లో కలిసిపోయిన కేసీఆర్, గవర్నర్.. సన్మానం కూడా..

By:  Tupaki Desk   |   28 Jun 2022 6:43 AM GMT
రాజ్ భవన్ లో కలిసిపోయిన కేసీఆర్, గవర్నర్.. సన్మానం కూడా..
X
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కయ్యానికి కాలుదూసిన కేసీఆర్ ఎట్టకేలకు హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ వెళ్లక తప్పలేదు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై చీఫ్ జస్టిస్ తో ప్రమాదణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి కేసీఆర్ పట్టువిడుపులు మాని హాజరుకావడం విశేషం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తదితర నేతలు హాజరయ్యారు. సుమారు 9 నెలల తర్వాత కేసీఆర్ రాజ్ భన్ కు వెళ్లడం గమనార్హం.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలంటారు.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు రాజ్ భవన్ అంటే రాను..రాను.. అన్న ఆయన ఇప్పుడు ఇప్పడు ఆ భవన్లో అడగుపెట్టనున్నారు. అంతకుముందు స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించినా వెళ్లని సీఎం ఇప్పుడు ఓ కార్యక్రమం సందర్భంగా ఆతిథ్యం పొందనున్నారు. అయితే కొంతకాలంగా కేసీఆర్, గవర్నర్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. కొన్ని విషయాల్లో వీరిద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ వివాదాలు తన జాతీయ రాజకీయ భవిష్యత్ పై పడే ప్రమాదముందని కేసీఆర్ గ్రహించారు. ఈ నేపథ్యంలో ఒకడుగు వెనకకు తగ్గించి గవర్నర్ తో మాట్లాడే అవకాశం ఉందని టీఆర్ఎస్ కేడర్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ కేసీఆర్ రాజ్ భవన్ కు ఎందుకు వెళ్తున్నారు..? గవర్నర్ తో మళ్లీ మాట్లాడనున్నారా..?

'కేసీఆర్ తనకు సోదరుడితో సమానం..' అని తమిళ సై ఆమె తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ ఓ వివాదం కారణంగా కేసీఆర్, గవర్నర్ మధ్య బాగా గ్యాప్ వచ్చింది. గవర్నర్ తో కలిసి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ హాజరు కావడం లేదు. అటు గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్టు ఉండడం లేదు. దీంతో తమిళ సౌ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రాజ్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.

గత కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు రాజకీయ వ్యూహం రచిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఢిల్లీలో జాతీయ రాజకీయారంగేట్రం చేయనున్నారు కూడా. ఇప్పుడున్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడానికి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటన చేసిన తరువాత దేశ వ్యాప్తగా తిరుగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో అభివృద్ధి చేశానని చెబుతున్న కేసీఆర్, ఎలాంటి వివాదాలు ఉండకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ తో రాజకీయంపై ఎలాంటి ప్రభావం ఉండొద్దని ఆలోచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం రాజ్ భవన్లో జరుగుతుంది. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించారు. గత స్వాతంత్ర్య వేడుకలకు పిలిచినా వెళ్లని కేసీఆర్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంపై రకరకాలు చర్చలు వస్తున్నాయి. ప్రధానంగా పైన చెప్పిన విధంగా అనుకుంటున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడంతో గవర్నర్ తో కేసీఆర్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని తమిళ సౌ ఆరోపించారు. అయితే ప్రోరోగ్ చేయని సమావేశాలను తిరిగి ప్రారంభించేందుకు గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా తమిళ సై వెళ్లిన చోట ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళ సై ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షా లను కూడా కలిశారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత కేసీఆర్ మళ్లీ రాజ్ భవన్ వెళ్లాలనుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అనుకుంటున్నారు.