కిడ్ లుక్ నుంచి మ్యాన్ లుక్ లోకి వచ్చిన కేసీఆర్ మనవడు

Mon Sep 26 2022 12:14:34 GMT+0530 (India Standard Time)

KCR's grandson who came from kid look to man look

కేసీఆర్ మనవడు.. కేటీఆర్ కుమారుడు హిమాన్షు లుక్ చేస్తే.. బొద్దుగా.. లావుగా ఇన్నాళ్లు ఉండేవాడు. తాత కేసీఆర్ కర్రపుల్లలా ఉంటే.. మనవడు నలభీముడిగా పక్కన నడిచేవాడు. అయితే ఇప్పుడు అందరికీ షాకిచ్చేలా హిమాన్షు మారిపోయాడు. హిమాన్షు లుక్ చూస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయం. ఒక హీరో లుక్ లోకి అంత ఈజీగా ఎలా మారిపోయాడని ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫొటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు.తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఎవరూ ఊమించనంతగా మారిపోయాడు. ఆయన తాజాగా ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి అంతా అవాక్కయ్యారు. ఇది హిమాన్షుయేనా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బాగా లావుగా ఉండే హిమాన్షు కొద్దిరోజులుగా ఫుల్ డైట్ తోపాటు ఎక్సర్ సైజులు చేసి ఇలా గుర్తుపట్టనంతగా బాగా సన్నబడ్డట్టు ఉన్నాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ డీజేలలో ఒకరైన 'అలాన్ వాకర్ ని' షో సందర్భంగా కలిశానంటూ హిమాన్షు పోస్ట్ చేశాడు. అదిప్పుడు వైరల్ అయ్యింది. ప్రస్తుతం స్కూలు చదువు చదువుతున్న హిమాన్షు ఇలా మారిపోవడం చూసి నిజంగా ఇతడేనా? అని అందరూ సందేహపడుతున్నారు.

 వరల్డ్ ఫేమస్ డీజేలలో ఒకరైన 'అలాన్ వాకర్ హైదరాబాద్ లోని శంషాబాద్లో షో నిర్వహించేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా అతడిని హిమాన్షు కలిశాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బ్లాక్ కలర్ డ్రెస్సులో కర్లీ హెయిర్ తో హిమాన్షు రావు టోటల్ డిఫెరెంట్ లుక్ హీరోలా కనిపిస్తున్నాడు. సన్నగా.. సగానికి సగం తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు.

బ్రిటన్ నార్వేకు చెందిన అలాన్ వాకర్.. డీజే సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ లో వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన షో హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. దీనికి కేటీఆర్ కుమారుడు హాజరై సందడి చేశాడు.

హిమాన్షు  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.. స్కూల్లో సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. స్కూల్లో ఓ విభాగంలో ప్రెసిడెంట్ గానూ గెలిచాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.