Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

By:  Tupaki Desk   |   31 March 2023 9:00 PM GMT
బీఆర్ఎస్ లో ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు?
X
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు గులాబీ బాస్ పట్టుమీదున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని వ్యూహం రచిస్తున్నాడు. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాడు. మరోమారు సిట్టింగులకే సీట్లు అని చెప్పిన కేసీఆర్.. ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకతపై పునరాలోచిస్తున్నాడట. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారిరి బరిలోకి దింపేందుకు రెడీ అవతున్నాడట. మొత్తంగా 19 నియోజకవర్గాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కోసం యాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే కేసీఆర్ మాత్రం 19 నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని గెలుపు గుర్రాలను లాక్కునేందుకు ట్రై చేస్తున్నారట.

రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తరుపున రెండుసార్లు పోటీ చేసిన వారెందరో ఉన్నారు. అయితే కొన్ని నియోజకవర్గార్లో తొమ్మిదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు సాగడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు సొంత పార్టీలోనే కొందరు వ్యతిరేకంగా మారారు.

నామినేటేడ్ పోస్టులు దక్కని వారితో పాటు ఎంతో కాలంగా జెండాలు మోసినా ఆశించిన గుర్తింపు లేదనే ఆవేదనతో కొనసాగుతున్నారు. అన్నీ కలగలిపి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై బహిరంగంగానే నిలదీస్తున్నారు. మంత్రుల వాహనాలను అడ్డుకుంటూ హంగా చేస్తున్నారు.

ఈ పరిస్థితి పెద్దాయన వద్దకు చేరయడంతో సిట్టింగులకే సీట్లు అన్న పదంపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 25 మంది ఎమ్మెల్యేలపై టిక్కెట్లు అనుమానమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

దీంతో ఆ 25 మంది ఎవరా? అని ఆలోచిస్తున్న తరుణంలో తాజాగా కేసీఆర్ వద్ద 19 మంది ఎమ్మెల్యేల చిట్టా ఉన్నట్లు హాట్ టాపిక్ గా మారింది. వీరి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత కేసీఆర్ వారికి టికెట్లు ఇచ్చే విషయంపై ఆలోచిస్తారట. దీంతో ఆ 19 మంది ఎవరా? అన్న చర్చ సాగుతోంది.

అయితే ఈ 19మంది విషయంలో కేసీఆర్ చర్యలు తీసుకుంటే మాత్రం ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది. లేదా ఇతర పార్టీల్లోని గెలుపు గుర్రాలను తీసుకొని వారికి టిక్కట్లు ఇవ్వాలని చూస్తున్నారు. దీంతో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దడ పుట్టుకుంది. ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కోసం రాష్ట్రమంతా తిరుగుతుంటే కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్ లోనే టికెట్ల వ్యూహం రచించడం ఆసక్తిగా మారిందని రాజకీయంగా చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.